నిద్రే నయం చేస్తోంది.. ఆజబ్బులకు అదే బెస్ట్ మెడిసిన్..
షుగర్, లేదా హార్ట్ ప్రాబ్లంతో బాధపడేవారు బయటపడే శుభవార్త చెప్పారు నిపుణులు. గాఢమైన నిద్రతో మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చని.. ఆవ్యాధుల ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని పరిశోధకులు గుర్తించారు.

Sleep and Brain Health
మీరు షుగర్, లేదా హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా..! లేదంటే మీ ఇంట్లో ఎవరైనా ఇదే జబ్బుల భారిన పడ్డారా! అయితే వీటి గురించి మీరు కానీ.. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వర్రీ కావాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. ఆయా జబ్బులతో బాధపడేవారు బయటపడే శుభవార్త చెప్పారు. గాఢమైన నిద్రతో మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యాధుల కారణంగా జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిసింది. అయితే వీటన్నిటికి నివారణ మార్గం మాత్రం ఒక్కటేనని చెప్పింది. ప్రశాంతంగా 6 నుంచి 8గంటల పాటు నిద్రపోవడం ద్వారా ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని పరిశోధకులు(Sleep and Brain Health) గుర్తించారు. అంతేకాదు.. మంచి నిద్రతో మెదడు పరిమాణం కూడా మెరుగ్గా ఉంటున్నట్లు తేలింది. అంటే ఆరోగ్యకరమైన నిద్ర కేవలం శరీరానికే కాదు.. మెదడుకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు.
నిద్రలేమీ..
మారుతున్న జీవనశైలిలో నిద్రకు ప్రాధాన్యత తగ్గిపోతోంది. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం.. సరైన నిద్ర లేకపోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. అయితే ఈ అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం మరోసారి హెచ్చరిస్తోంది. ముఖ్యంగా మధుమేహం, గుండెజబ్బులు ఉన్నవారు నిద్ర నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు. నిద్ర(Sleep and Brain Health) అలవాట్లను మెరుగుపరుచుకోవడం మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తోడ్పడుతుందని చెబుతున్నారు.
నిపుణుల పరిశోదన..
నిద్రకు, మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు భారీ అధ్యయనం నిర్వహించారు. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు సహా పలువురు శాస్త్రవేత్తలు యూకే బయోబ్యాంక్కు చెందిన 4 లక్షల మందికి పైగా ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 54 వేల మందికి పైగా గుండె, జీవక్రియ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారున్నారు. నిద్ర(Sleep and Brain Health) వ్యవధి, జీవగడియారం, నిద్రలేమి, గురక, పగటిపూట నిద్రమత్తు వంటి ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అంతేకాదు.. సుమారు 35 వేల మందికి సంబంధించిన మెదడు ఎంఆర్ఐ స్కాన్లను కూడా పరిశీలించారు. నాణ్యమైన నిద్రతో మెదడు పనితీరులో సానుకూల మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చక్కగా నిద్రపోయేవారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండటంతో పాటు.. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సమాచారాన్ని వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యం కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా షుగర్, హార్ట్ ఎటాక్, పక్షవాతం వంటి సమస్యలున్నవారిలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించడం విశేషం.



