గెలుపే లక్ష్యంగా ఎస్పీ అలివిగాని హామీలు.. దేశ వ్యాప్తంగా చర్చ
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అయింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను సైతం రిలీజ్ చేశారు. గెలుపే టార్గెట్‌గా ముందుగానే హామీలను ప్రకటించారు.

Akhilesh Yadav UP Election Manifesto 2027
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అయింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను సైతం రిలీజ్ చేశారు. గెలుపే టార్గెట్‌గా ముందుగానే హామీలను ప్రకటించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం (నవంబర్ 26) లక్నోలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘జన్-మన్ కా మేనిఫెస్టో’, ‘సత్తైస్ కా సంకల్ప్: PDA కా ప్రణ్ పత్ర’ పేర్లతో విడుదల(Akhilesh Yadav UP Election Manifesto 2027) చేసిన ఈ ఎన్నికల ప్రణాళికలో యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. “అచ్ఛే దిన్ రాలేదు.. కానీ బురే దిన్ వెళ్లిపోయే సమయం వచ్చింది” అంటూ బీజేపీ గత ఎన్నికల నినాదాన్ని ప్రస్తావిస్తూ అఖిలేశ్ యాదవ్ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం లభించే వరకు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.5,000 భృతి అందిస్తామని ప్రకటించారు.
మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలు
1.నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.5,000 భృతి.
2. ఐదేళ్లలో 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన.
3. మహిళలు, వృద్ధులు, పేద కుటుంబాలకు ఏడాదికి రూ.40,000 ఆర్థిక సాయం.
4. పేద కుటుంబాలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం.
5.26 వేల మూసివేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పునఃప్రారంభం.
6.12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.
6.9వ తరగతి ఆపై చదివే బాలికలకు సైకిల్, సోలార్ ల్యాంప్.
7.ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ.
8.రైతులకు రుణమాఫీ హామీ.
9.మహిళలు, పేదలకు రూ.5కే భోజనం అందించే సమాజ్‌వాదీ క్యాంటీన్లు.
10.పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం.
11.వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యం.
జెన్‌జీ ఎఫెక్ట్..యువతే టార్గెట్
యువతే టార్గెట్‌గా ప్రధాన హామీలను ప్రకటించారు అఖిలేష్ యాదవ్. తమ కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాదు ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్లకు ఉపాధి లభించే వరకు నెలకు రూ.5,000 అందిస్తామన్నారు. అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలపై తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.పేపర్ లీకేజీలను అరికట్టి, నియామక పరీక్షలను నిర్ణీత అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జాబ్ రిలీజ్(Akhilesh Yadav UP Election Manifesto 2027) చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
మహిళలకు ఏడాదికి రూ.40 వేలు..
మహిళా ఓటర్లను ఆకర్షించేలా అఖిలేశ్ యాదవ్ మేనిఫెస్టోలో ప్రత్యేక హామీలు ప్రకటించారు.అర్హులైన మహిళలకు ఏడాదికి రూ.40,000 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు.. వేగంగా న్యాయం అందించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉచిత వైద్య సేవలు, అంబులెన్స్ సదుపాయాలు విస్తరిస్తామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ తన మేనిఫెస్టో(Akhilesh Yadav UP Election Manifesto 2027)లో ప్రకటించింది.
OPS మళ్లీ తీసుకొస్తాం!
ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని సమాజ్‌వాదీ పార్టీ మరో కీలక హామీ ఇచ్చింది. అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానం (OPS)ను తిరిగి అమలు చేస్తామని ప్రకటించింది. అలాగే
మూతపడిన ప్రాథమిక పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. విద్యామిత్రలకు మెరుగైన వేతనాలు, శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో వైఫై, వీధి దీపాలు, విద్యుత్, సీసీ రోడ్ల సదుపాయాలు కల్పించడం..విద్య, ఉపాధి రంగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని(Akhilesh Yadav UP Election Manifesto 2027) పార్టీ తన ప్రణాళికలో పేర్కొంది.
PDA సామాజిక న్యాయ ఎజెండా
అఖిలేశ్ యాదవ్ ఈ ఎన్నికల ప్రణాళికలో PDA ఫార్ములాకు పెద్దపీట వేశారు. PDA అంటే పిచ్డా (వెనుకబడిన తరగతులు), దళిత్ (దళితులు), అల్పసంఖ్యక్ (మైనారిటీలు).
ఈ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలు చేశారు. కులగణన నిర్వహణ, అణగారిన వర్గాలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవకాశాలు కల్పించడం వంటి అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చారు. రైతులు, పేదలు, చిన్న వ్యాపారులు, యువత సంక్షేమానికి సంబంధించిన హామీలను కూడా ప్రకటించారు. మహిళల కోసం ‘ఆధీ ఆబాదీ’ పేరుతో మరో ప్రత్యేక మేనిఫెస్టో తీసుకురానున్నట్లు అఖిలేష్(Akhilesh Yadav UP Election Manifesto 2027) ప్రకటించారు. స్థానిక సమస్యలు, మౌలిక సదుపాయాలు, మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పత్రాలను రూపొందించనున్నారు.
గెలవడమే ముఖ్యం
2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. 25 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.5,000, మహిళలకు ఏడాదికి రూ.40,000, రైతులకు రుణమాఫీ వంటి హామీలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది.ముఖ్యంగా నిరుద్యోగం, విద్య, రైతుల సమస్యలు, మహిళల సంక్షేమం, పాత పెన్షన్ విధానం వంటి అంశాలను ప్రధాన ఎన్నికల అజెండాగా మార్చింది. అభారీ హామీలతో(Akhilesh Yadav UP Election Manifesto 2027) రాజకీయ వేడిని పెంచారు. ఇప్పుడు ఈ హామీలకు ఓటర్లు ఎలా స్పందిస్తారు? బీజేపీ దీనికి ఎలాంటి ప్రతివ్యూహం సిద్ధం చేస్తుంది? అన్నది 2027 ఎన్నికల్లో ఆసక్తికరంగా మారనుంది.
सत्ताइस का संकल्प, पीडीए का प्रणपत्र। जन-मन का मैनिफेस्टो ! https://t.co/WmTFTDpwEd
— Samajwadi Party (@samajwadiparty) November 26, 2026



