సీఎం లవ్‌స్టోరీ.. వేలకిలోమీటర్ల బైక్ ప్రయాణం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన లవ్ స్టోరీని మరోసారి బయటపెట్టారు. తన ప్రేయసిని కలిసేందుకు సుమారు 3500 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు బైక్ పై వెళ్లినట్లు తెలిపారు.

RevanthReddy Love Story
రాజకీయాల్లో తనదైన దూకుడు, విలక్షణమైన మాటతీరు, ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి జీవితంలో మరో కోణం ఉంది. అది ఆయన ప్రేమకథ!. రీసెంట్‌గా ఆయన ఎంగేజ్‌లో ప్రేమను తెలియపరిచారు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామిగా చేసుకోవాలనే పట్టుదలతో అప్పట్లో ఏకంగా బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన ఆయన సాహసం యాత్ర గురించి సీఎం చెప్పడం(RevanthReddy Love Story) ఆసక్తిరేపుతోంది. మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఈ ఆసక్తికర ప్రేమ ప్రయాణాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. పాత జ్ఞాపకాలు మళ్లీ నెమరువేసుకున్నారు.
ప్రేమ కోసం సుదీర్ఘ ప్రయాణం?
ప్రేవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నను యాంకర్ అడిగారు. అప్పుడు ఆయన పెళ్లికి ముందు తన సతీమణి గీతతో ప్రేమలో ఉన్న సమయంలో ఆమెకు తన ప్రేమ విషయాన్ని చెప్పేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బైక్‌పై వెళ్లారన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆమె దాదాపు 3,200 కిలోమీటర్ల రానూపోనూ ప్రయాణాన్ని బైక్‌పై ఎలా చేయగలిగారని సరదాగా ప్రశ్నించారు. దీనికి రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ‘‘అది 1990లలో జరిగిన విషయం. ఇప్పుడెందుకులెండి?’’ అంటూ నవ్వుతూ సమాధానాన్ని దాటవేశారు. వ్యాఖ్యాత మరింత ఆసక్తి చూపడంతో.. ‘‘ప్రేమలో ఉన్నప్పుడు వెయిట్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో.. అది ప్రేమలో(RevanthReddy Love Story)ఉన్నవాళ్లకే తెలుస్తుందన్నారు. అది నా వ్యక్తిగతం.. పబ్లిక్‌కు ఎందుకండి’’ అంటూ ముసిముసి నవ్వులతో బదులిచ్చారు. దీంతో అక్కడున్నవారిలో నవ్వులు విరిశాయి.
నాగార్జునసాగర్‌లో మొదలైన పరిచయం
రేవంత్‌రెడ్డి, గీతల పరిచయం వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉంది. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న రోజుల్లో నాగార్జునసాగర్ వద్ద జరిగిన పరిచయం వారి జీవితాలను మలుపు తిప్పింది. ఒక కార్యక్రమానికి వెళ్లిన సందర్భంలో బోటు ప్రయాణం సమయంలో గీతతో రేవంత్‌రెడ్డికి పరిచయం ఏర్పడినట్లు గతంలో ఆయన వెల్లడించారు. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా(RevanthReddy Love Story)మారింది. అయితే వీరి ప్రేమకు పెళ్లి రూపం ఇవ్వడం అంత సులభంగా జరగలేదు. ఇద్దరి కుటుంబాల రాజకీయ నేపథ్యాలు, అభిప్రాయ భేదాలు వివాహానికి అడ్డంకిగా మారాయి. గీత కుటుంబం మొదట్లో ఈ పెళ్లికి అంగీకరించలేదు.
ప్రేమను ఒప్పించేందుకు ఢిల్లీకి బైక్‌పై!
గీత కుటుంబానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా మారారు. గీతను ఢిల్లీలో ఉన్న జైపాల్‌రెడ్డి వద్దకు పంపించినట్లు టాక్. దీంతో రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గకుండా స్వయంగా ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజుల్లో ఇప్పటిలా ప్రయాణ సౌకర్యాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అందుబాటులో లేని పరిస్థితుల్లో బైక్‌పై సుదీర్ఘ ప్రయాణం చేశారు. అక్కడ గీతను కలుసుకోవడంతో పాటు జైపాల్‌రెడ్డిని కలిసి తన మనసులోని మాటను వివరించారు. గీతను పెళ్లి చేసుకోవాలన్న తన నిర్ణయాన్ని ఆయనకు స్పష్టంగా తెలియజేశారు. చివరకు పెద్దల అంగీకారం లభించడంతో వీరి ప్రేమకథ (RevanthReddy Love Story) పెళ్లి బంధంగా మారింది. 1992 మే 7న రేవంత్‌రెడ్డి, గీత వివాహం చేసుకున్నారు. వీరికి నిమిషా రెడ్డి అనే కుమార్తె ఉన్నారు.
స్టూడెంట్ లీడర్ TO సీఎం..
రేవంత్‌రెడ్డి వ్యక్తిగత జీవితంలో ప్రేమ కోసం చేసిన ఈ సాహసం ఒక కోణమైతే.. రాజకీయ జీవితంలో ఆయన ఎదుగుదల మరో ఆసక్తికర ప్రయాణం. మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన ఆయన విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఏబీవీపీతో అనుబంధం కలిగి విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పనిచేశారు. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఆయన ప్రజాప్రతినిధిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలయ్యారు. ఓటమితో ఆయన వెనుకడుగు వేయలేదు. ఇక్కడే ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (RevanthReddy Love Story) బాధ్యతలు స్వీకరించారు.
34 ఏళ్ల తర్వాత మళ్లీ జ్ఞాపకం!
ఇటీవల నాగార్జునసాగర్ పరిసరాల్లో నిర్వహించిన మహా వరుణయాగం కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి తన సతీమణి గీతతో కలిసి పాల్గొన్నారు. అనంతరం నాగార్జునసాగర్ జలాశయాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంతో తమకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమ తొలి పరిచయం, ప్రేమకు ఈ ప్రాంతమే వేదిక కావడంతో అక్కడి జ్ఞాపకాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. అయితే రేవంత్‌రెడ్డి తన ప్రేమకథను(RevanthReddy Love Story)గతంలోనూ కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు. తాజాగా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన చమత్కారమైన సమాధానం మరోసారి ఆ కథను వార్తల్లోకి తెచ్చింది.
Revanth Reddy Rode A Motorcycle All The Way From Andhra Pradesh To Delhi To Win His Wife’s Hand In Marriage! Don’t Miss This Interesting Anecdote
WATCH LIVE : https://t.co/DDuJpwJOX1
#SouthernRisingSummit2026 #SouthernRisingSummit #ABPLIVE
@MeghaSPrasad @revanth_anumula https://t.co/UYCC0RDkVr
— ABP LIVE (@abplive) November 20, 2026



