తిరుమలేశుడికి తప్పని ఎల్‌నినో ఎఫెక్ట్.. టీటీడీ ముందస్తు అలర్ట్!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సైతం ఎల్‌నినో ఎఫెక్ట్ తప్పడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలు.. ప్రాజెక్టుల్లో తరిగిపోతున్న వాటర్ తో ఇప్పుడు తిరుమలలో ఆందోళన పరిస్థితి నెలకొంది.

Tirumala Water Shortage
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సైతం ఎల్‌నినో ఎఫెక్ట్ తప్పడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలు.. ప్రాజెక్టుల్లో తరిగిపోతున్న వాటర్ తో ఇప్పుడు తిరుమలలో ఆందోళన పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఎండల తీవ్రత పెరుగుతుండటం, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలపై అనిశ్చితి నెలకొనడంతో తిరుమలలో నీటి నిల్వలపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు మరో 120 రోజుల అవసరాలకు మాత్రమే(Tirumala Water Shortage) సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వేసవి ముప్పు ముంచుకొచ్చేలోపే నీటి పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది టీటీడీ.
రోజుకు 60 లక్షల గ్యాలన్లు..
తిరుమలలో నీటి అవసరాలు సాధారణ పట్టణాలతో పోలిస్తే చాలా ఎక్కువ. భక్తుల రద్దీని బట్టి రోజుకు సుమారు 50 నుంచి 60 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. తాగునీరు, వసతి గదులు, అన్నప్రసాద కేంద్రాలు, పారిశుద్ధ్య నిర్వహణ.. ఇలా ప్రతి అవసరానికీ నీరు తప్పనిసరి. ప్రస్తుతం తిరుమలకు ప్రధానంగా ఐదు జలాశయాల నుంచి నీరు అందుతోంది. పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు కొండపై నీటి అవసరాల్లో సగభాగాన్ని తీరుస్తున్నాయి. మిగిలిన నీటిని తిరుపతి సమీపంలోని కల్యాణి డ్యామ్ నుంచి సరఫరా చేస్తున్నారు. గతంలో కురిసిన వర్షాలు కొంత ఉపశమనం కలిగించినా, రానున్న నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనతో(Tirumala Water Shortage) అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హోటళ్లు, మఠాలపై ఆంక్షలు
జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయనే సమాచారంతో టీటీడీ ముందస్తుగా అప్రమత్తం అయింది. నీటి నిల్వలను కాపాడుకోవాలంటే వినియోగాన్ని నియంత్రించడం తప్పనిసరి అని భావిస్తోంది. ఈ దిశగా టీటీడీ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. తిరుమలలోని ప్రైవేటు హోటళ్లు, మఠాలు, వాణిజ్య సముదాయాలకు నీటి సరఫరా సమయాన్ని తగ్గించింది. ఇకపై ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మాత్రమే నీటిని అందించేలా నిర్ణయం తీసుకుంది. అవసరానికి మించి నీటిని వినియోగించకుండా చూడటంతో పాటు, ప్రైవేటు హోటళ్లకు అవసరమైతే తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా(Tirumala Water Shortage) నీటిని తెప్పించుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తోంది.
వర్షాలు కురిస్తే ఢోకా లేదు!
టీటీడీ అధికారుల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండితే తిరుమలకు సుమారు 18 నెలల వరకు నీటి సమస్య ఉండదని అంచనా వేస్తున్నారు. అదే వర్షాలు ముఖం చాటేస్తే మాత్రం పరిస్థితి కొంత క్లిష్టంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందుగానే ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కల్యాణి డ్యామ్‌తో పాటు ఇతర నీటి వనరుల నుంచి అదనపు నీటిని తీసుకొచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే ప్రభుత్వ సహకారంతో అదనపు నీటి సరఫరా మార్గాలను(Tirumala Water Shortage) అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
శాశ్వత పరిష్కారాలపై దృష్టి
ప్రతిసారీ వర్షాలపైనే ఆధారపడకుండా నీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనాలని టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగా జలాశయాల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటి పనులపై(Tirumala Water Shortage) దృష్టి సారిస్తోంది. నీటి సరఫరా పైపులైన్లలో లీకేజీలను గుర్తించి అరికట్టేందుకు కూడా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.



