అక్వాన్ తుపాను.. మూడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
ఆంధ్రప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను తీవ్ర తుపానుగా మారింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్‌లో వెల్లడించింది. మూడు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది.

Cyclone Akvan
ఆంధ్రప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను తీవ్ర తుపానుగా మారింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్‌లో వెల్లడించింది. తుపాను ప్రభావంతో ఏపీ, ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అప్రమత్తం(Cyclone Akvan ) చేసింది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తీవ్ర తుపానుగా అక్వాన్
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను క్రమంగా బలపడుతోంది. నవంబర్ 18 ఉదయం 5.30 గంటలకు ఇది తీవ్ర తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నర్సాపూర్ నుంచి పూరీ మధ్య ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని(Cyclone Akvan ) హెచ్చరించింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ గంటకు 8 కిమీ వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 520కిమీ, చెన్నైకి 560 కిమీ, కళింగపట్నంకి 570 కిమీ, గోపాల్‌పూర్‌కి 660 కిమీ, పూరీకు 720 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో నవంబర్ 19, 20 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రజలు తీర ప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా(Cyclone Akvan ) ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్
గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్
ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 520కిమీ, చెన్నైకి 560 కిమీ, కళింగపట్నంకి 570 కిమీ
గోపాల్‌పూర్‌కి 660 కిమీ,పూరీకు 720 కి.మీ దూరంలో కేంద్రీకృతం
ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య
ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్ గా దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో ఈదురుగాలులు
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
#RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra
— Real Time Governance Society AP (@rtgsap) November 18, 2026
తెలంగాణకు వర్ష సూచన
అక్వాన్ తుపాను ప్రభావం తెలంగాణపైనా కనిపించే అవకాశం ఉంది. నవంబర్ 20, 21 తేదీల్లో తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు వర్ష సూచన (Cyclone Akvan )చేసింది ఐఎండీ.
IMD track – From Bapatla to Kakinada Srikakulam now
#CycloneAkvan is one of the most erratic cyclone that we have ever seen in last many years
This is 4th time since IMD changed its cyclone track frequently, next 5th change is that, they might further degrade to CS/DD while crossing the coast
Take a look how the track kept changing in last 4days, thankfully, it’s not a major impact system for already suffering AP
— Telangana Weatherman (@balaji25_t) November 18, 2026
చెన్నైకి ఆరంజ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను ఉత్తర దిశగా కదులుతున్న నేపథ్యంలో తమిళనాడులో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్(Cyclone Akvan ) జారీ చేసింది. నవంబర్ 19 తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఎక్కడ తీరం దాటనుంది?
ప్రస్తుతం చెన్నైకి తుపాను నేరుగా తాకే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్వాన్ తుపాను(Cyclone Akvan ) నవంబర్ 20 మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్ నుంచి ఒడిశాలోని పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని అంచనా వేస్తున్నారు.



