నా మౌనం బలహీనత కాదు.. నా సహనం భయం కాదు: రుక్మిణి కోట
ఉద్యోగాల నియామకం పేరుతో జరిగిన మోసంలో తన ప్రమేయం లేదని జనసేన మహిళా నేత రుక్మిణి కోట స్పష్టం చేశారు. తన పేరు, కంపెనీ గుర్తింపును దుర్వినియోగం చేశారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పేరును వివాదంలోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.

Rukmini Kota Statement
తనపై కొంతకాలంగా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై జనసేన నాయకురాలు రుక్మిణి కోట స్పందించారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, వ్యక్తిగత జీవితంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తూ, వృత్తిపరమైన ప్రతిష్ఠను దిగజార్చేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని(Rukmini Kota Statement) ఆమె ఆరోపించారు. ఇన్నాళ్లూ సంయమనం పాటిస్తూ మౌనంగా ఉన్నానని, అయితే ఇప్పుడు హద్దులు దాటడంతో స్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘Rukmini Kota’ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉద్యోగాల పేరుతో మోసం
తన సంస్థలో పనిచేసిన ఓ ఉద్యోగి జాబ్స్ నియామకం పేరుతో తీవ్రమైన మోసానికి పాల్పడినట్లు ఇటీవల తన దృష్టికి వచ్చిందని రుక్మిణి కోట వెల్లడించారు. ఈ వ్యవహారంలో తన పేరు, కంపెనీ గుర్తింపు, అధికారిక పత్రాలను ఉపయోగించుకుని ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించినట్లు(Rukmini Kota Statement) తెలిపారు. ఈ కార్యకలాపాలన్నీ తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా, సంస్థ అధికారిక పని వేళలకు వెలుపల జరిగాయని వివరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే సంబంధిత ఉద్యోగికి షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరినట్లు తెలిపారు. అంతర్గత విచారణ తర్వాత ఆ ఉద్యోగి సేవలను నిలిపివేశామని, బాధ్యులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత పోలీసు అధికారులకు అధికారిక ఫిర్యాదు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
Over the years, I have learnt from my leader, inspiration and mentor, Sri.Pawan Kalyan garu, that challenges and obstacles are inevitable on the path of Dharma. His indomitable spirit, resilience and patience have taught me to remain steadfast in my principles and values, stand with courage in the face of adversity and never allow any challenge to weaken my resolve.
I am, and shall forever remain, a deeply committed Janasainik.
Jai Hind.
#SatyamevaJayate— Rukmini Kota (@kotarukmini) November 18, 2026
వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం
అసలు మోసానికి పాల్పడిన వారిని ప్రశ్నించాల్సింది పోయి, కొందరు రాజకీయ నాయకులు, మీడియా వేదికలు ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారురాలిగా ఉన్న తననే నిందితురాలిగా చిత్రీకరిస్తున్నాయని రుక్మిణి కోట ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను వక్రీకరిస్తూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
తనపై కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న పరువు నష్టం కలిగించే ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు(Rukmini Kota Statement) తెలిపారు. ఒక మహిళ గౌరవం, ఆత్మగౌరవం కేవలం ఆమె ఒక్కరి బాధ్యత మాత్రమే కాదని, సమాజం కూడా వాటిని గౌరవించాలని పేర్కొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో, జనసేన పార్టీ ఝాన్సీ వీర మహిళల ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతానని చెప్పారు.
వివాదంలోకి పవన్‌ని లాగొద్దు..
ఇదే సమయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును ఈ వివాదంలోకి లాగడంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్, 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ నాయకత్వం, సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నానని గుర్తుచేశారు. ఆయన పేరును తప్పుడు కథనాలతో వివాదంలోకి లాగొద్దని కోరారు. తనపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేసినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా భయపడేది లేదని రుక్మిణి కోట(Rukmini Kota Statement) స్పష్టం చేశారు. తన కుటుంబాన్ని కూడా ఈ వివాదంలోకి లాగడాన్ని సహించబోనని పేర్కొన్నారు. తన గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తానని తెలిపారు. “ప్రతీకారం కంటే సంయమనానికే ప్రాధాన్యం ఇస్తాను. భయం కంటే ధైర్యాన్ని, కక్ష సాధింపు కంటే న్యాయాన్ని ఎంచుకుంటాను. నా మౌనాన్ని బలహీనతగా, నా సహనాన్ని భయంగా భావించవద్దు. ధర్మం మార్గంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలని నా నాయకుడు పవన్ కళ్యాణ్ నుంచి నేర్చుకున్నాను. నేను నిబద్ధత కలిగిన జనసైనికురాలిని.. ఎప్పటికీ అలానే ఉంటాను” అని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.



