Bandla Ganesh Cheque Bounce Cases

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు కోర్టు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు రూ. 95 లక్షల భారీ జరిమానా విధిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. కేసు విచారణ నిమిత్తం బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా బండ్ల గణేశే పూర్తిగా భరించాలని స్పష్టం చేసింది. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేశ్ తన నిర్మాణ సంస్థ ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరిట రూ. 95 లక్షల విలువైన చెక్ ఇచ్చారు. బ్యాంక్ ఖాతాలో సరిపడా నిధులు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్(Bandla Ganesh Cheque Bounce Cases) అయింది.

చెక్‌బౌన్స్ కేసులు కొత్తేమీ కాదు
తనకు ఇచ్చిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నగదు చెల్లింపు విషయంలో న్యాయం జరగకపోవడంతో బాధితుడు జెట్టి వెంకటేశ్వర్లు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. 2024 ఫిబ్రవరి 14న ఒంగోలు రెండో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదు చేశాడు. ఈకేసుకు సంబంధించి న్యాయస్థానంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత .. నేరం రుజువు కావడంతో కోర్టు బండ్ల గణేశ్‌ను దోషిగా(Bandla Ganesh Cheque Bounce Cases) తేల్చింది. ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల జరిమానా విధించింది. గతంలోనూ పలు చెక్ బౌన్స్ కేసుల్లో బండ్ల గణేశ్‌కు న్యాయస్థానాలు జైలు శిక్షలు విధించగా, ఆయన పైకోర్టుల్లో అప్పీల్‌కు వెళ్లారు. బండ్ల గణేశ్‌కు చెక్‌బౌన్స్ కేసులు కొత్తేమీ కాదు. గతంలోనూ హైదరాబాద్, కడప ప్రాంతాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి.

2017లో వక్కంతం వంశీ కేసు
ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాకు కథ అందించిన రచయిత వక్కంతం వంశీకి పారితోషికం చెల్లించే విషయంలో బండ్ల గణేశ్ ఇచ్చిన రూ.25 లక్షల చెక్ బౌన్స్ అయి కేసు నమోదైంది. ఈ కేసులో 2017 నవంబర్‌లో హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు ఆరు నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15,86,550 జరిమానా విధించింది. ఈకేసులో ఆయనకు బెయిల్ (Bandla Ganesh Cheque Bounce Cases)లభించింది.

2019లో కడపలో అరెస్ట్
కడప జిల్లాకు చెందిన బచ్చు మహేష్ కుమార్‌తో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మరో చెక్‌బౌన్స్ వివాదం తెరపైకి వచ్చింది. 2014లో తీసుకున్న అప్పు తిరిగి చెల్లింపులో భాగంగా ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో 2019 అక్టోబర్‌లో పోలీసులు బండ్ల గణేశ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 10 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత రాజీ ప్రయత్నాలు, చెల్లింపుల నేపథ్యంలో ఆయనకు బెయిల్(Bandla Ganesh Cheque Bounce Cases) లభించింది.గతంలోనూ చెక్‌బౌన్స్ కేసుల్లో కోర్టు తీర్పులను ఎదుర్కొన్న బండ్ల గణేశ్ పేరు మరోసారి వార్తల్లో నిలవడంతో టాలీవుడ్‌లో చర్చ మొదలైంది.