Anirudh 15 Years Music Journey

లేటెస్ట్ ట్రెండ్‌లో యూత్‌ను ఉర్రూతలూగించే బెస్ట్ మ్యూజిషీయన్‌ అనిరుధ్‌ రవిచందర్‌. ఆయన మ్యూజిక్ మొదలైతే చాలు.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే. చిన్న పాటైనా, భారీ యాక్షన్ సీన్‌అయినా తనదైన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయడం అనిరుధ్ ప్రత్యేకత. వరుస సినిమాలు, బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్, అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో దూసుకుపోతున్న ఈ మ్యూజిక్ సెన్సేషన్ తాజాగా తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. సంగీత దర్శకుడిగా 15 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగ పోస్ట్(Anirudh 15 Years Music Journey) చేశాడు. అదే ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు కావ్య మారన్‌తో వివాహం, తాజాగా వైరల్ అవుతున్న ఆయన ఇంటి విశేషాలు కూడా ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

15 ఏళ్ల ప్రయాణం..
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న.. ఈయువ సంగీత దర్శకుడు మ్యూజిక్‌ అనే మ్యాజిక్‌తో సంచలనం సృష్టిస్తున్నాడు. 2011లో విడుదలైన ‘Why This Kolaveri Di’ పాటతో అనిరుధ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఒక్క పాటతోనే యువతను తనవైపు తిప్పుకున్న ఆయన.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తమిళంతో మొదలైన ఆయన సంగీత ప్రయాణం తెలుగు, హిందీతో పాటు ఇతర భాషలకూ విస్తరించింది. ఎన్నో భారీ చిత్రాలకు(Anirudh 15 Years Music Journey) సంగీతం అందించడమే కాకుండా, స్వతంత్ర సంగీతం, అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేయడం ద్వారా తన పరిధిని మరింత విస్తరించుకున్నారు.

తన 15 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ అనిరుధ్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. తన తొలి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, విజయాలు, అభిమానుల ప్రేమను గుర్తుచేసుకున్నారు. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సంగీతాన్ని అందించడం, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం, అంతర్జాతీయ కళాకారులతో పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చాయన్నారు. ప్రతి పాట, ప్రతి సహకారం, ప్రతి విజయం తనకు ఒక వరమని భావోద్వేగంతో తెలిపారు. ఇంతటి ఆదరణ అందించిన సంగీత పరిశ్రమకు తిరిగి ఏదైనా ఇవ్వాలనే ఆలోచన, తపన తనలో ఉందని వెల్లడించారు.

కొత్త టాలెంట్‌ కోసం..
అనిరుధ్ తన 15 ఏళ్ల ప్రయాణంలో మరో కీలక అడుగు వేస్తున్నారు. సంగీత పరిశ్రమకు తన వంతుగా సహకారం అందించాలనే ఉద్దేశంతో ‘అల్బుకెర్కీ రికార్డ్స్’ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా కొత్త తరం సంగీత కళాకారులకు అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తాను సాధించిన విజయాల వెనుక ఎంతోమంది కళాకారులు, సంగీత నిపుణులు, అభిమానుల సహకారం ఉందని భావిస్తున్న అనిరుధ్.. రాబోయే తరాలకు కూడా అలాంటి అవకాశాలు అందించాలనుకుంటున్నారు. కేవలం సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా, కొత్త ప్రతిభను ప్రోత్సహించే దిశగా అడుగులు వేయడం ఆయన కెరీర్‌లో (Anirudh 15 Years Music Journey)ఆసక్తికరమైన పరిణామం అని చెప్పారు.

భారీ ప్రాజెక్టులు..
ఈ ఏడాది అనిరుధ్ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన అధ్యాయంగా నిలవనుంది. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)’, ‘జననాయగన్’, ‘డీసీ’, ‘ది ప్యారడైజ్’, ‘జైలర్ 2’ వంటి భారీ ప్రాజెక్టులతో ఆయన పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలు, విజయ్ ప్రాజెక్టులు, తెలుగు చిత్రాలతో ఆయన సంగీత ప్రయాణం మరింత విస్తరిస్తోంది. విభిన్న కథలకు తగ్గట్టుగా కొత్త సౌండ్స్‌ను పరిచయం చేయడం, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ట్యూన్స్ రూపొందించడం అనిరుధ్ ప్రత్యేకత. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలకే ప్రత్యేకమైన హైప్(Anirudh 15 Years Music Journey) తీసుకొస్తుంటుంది.

కావ్యతో కొత్త జీవితం..
వృత్తిపరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిరుధ్ వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో, కావ్య మారన్‌ను నవంబర్ 11న గ్రీస్‌లో పెళ్లి చేసుకున్నారు. అనిరుధ్ తన వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్ జరగనుంది. దీంతో ఈ జంటకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో(Anirudh 15 Years Music Journey) ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.

బెడ్‌రూమ్‌లో మంచం లేదు!
అనిరుధ్ గురించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లు అంటే ఖరీదైన ఫర్నిచర్, విలాసవంతమైన ఇంటీరియర్స్, అత్యాధునిక సౌకర్యాలు గుర్తుకొస్తాయి. కానీ అనిరుధ్ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతారు. ఇందుకు ఆయన చెన్నై నివాసమే ఒక ఉదాహరణ. గతంలో ఓ హోమ్ టూర్ సందర్భంగా తన ఇంటిని పరిచయం చేసిన అనిరుధ్.. బెడ్‌రూమ్‌లో పెద్ద మంచం లేకుండా నేలపైనే మ్యాట్రెస్ వేసుకుని నిద్రపోతానని వెల్లడించారు. నేలపై పడుకోవడం తనకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, అందుకే ప్రత్యేకంగా బెడ్ ఏర్పాటు చేసుకోలేదని చెప్పారు. అంతేకాదు, తన దగ్గర ఎక్కువ దుస్తులు కూడా ఉండవని, అందువల్ల పెద్ద వార్డ్‌రోబ్ లేదా ప్రత్యేకమైన స్టోరేజ్ అవసరం లేదని సరదాగా(Anirudh 15 Years Music Journey) పేర్కొన్నారు. స్టార్‌డమ్, బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా వ్యక్తిగత జీవితాన్ని సాధారణంగా ఉంచుకోవాలనే ఆయన అభిరుచి ఈ మాటల్లో కనిపిస్తుంది.

స్టార్‌డమ్ పెరిగినా సింప్లిసిటీ..
ఒకవైపు కోట్లాది మంది అభిమానులు, మరోవైపు భారీ సినిమా ప్రాజెక్టులు, అంతర్జాతీయ గుర్తింపు.. ఇలా అనిరుధ్ కెరీర్ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు కొత్త రికార్డ్ లేబుల్ ద్వారా సంగీత పరిశ్రమకు మరింత సేవ చేయాలని భావిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలోనూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ఇన్ని విజయాలు సాధించినప్పటికీ తన వ్యక్తిగత జీవనశైలిలో మాత్రం ఆడంబరాలకు దూరంగా ఉండటం అభిమానులను ఆకట్టుకుంటోంది. నేలపై మ్యాట్రెస్ వేసుకుని నిద్రపోవడం నుంచి కుటుంబ జ్ఞాపకాలకు ఇంట్లో ప్రత్యేక స్థానం కల్పించడం వరకు ఆయనలోని మరో కోణాన్ని ఈ హోమ్ టూర్(Anirudh 15 Years Music Journey) బయటపెట్టింది. 15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తయినా ఇంకా ఎన్నో కలలు మిగిలే ఉన్నాయని చెబుతున్న అనిరుధ్.. మళ్లీ స్టూడియోలోకి అడుగుపెడుతున్నట్లు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అంటూ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. మరి రాబోయే రోజుల్లో అనిరుధ్ నుంచి ఎలాంటి మ్యూజికల్ మ్యాజిక్ రాబోతోందో చూడాలి!