Indiramma Family Insurance Scheme

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తోంది. నవంబర్ 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పిస్తోంది ప్రభుత్వం. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం(Indiramma Family Insurance Scheme) చుడుతోంది. సిద్దిపేటలో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈకార్యక్రమంలో ఇందిరమ్మ చీరల పంపిణీని కూడా ప్రారంభించనున్నారు.

పథకాం ఎందుకు?
ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటాయి. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, ఇతర అవసరాలను తీర్చుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తోంది. కులం, మతం, ఆదాయం వంటి తేడాలు లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ప్రకటించింది. పేద కుటుంబాలు, ఉపాధి హామీ కూలీలు, వివిధ వృత్తులపై ఆధారపడిన కుటుంబాలతో పాటు ఇప్పటికే ప్రభుత్వ బీమా పథకాల పరిధిలో ఉన్నవారిని కూడా ఇందులో భాగం చేయాలని ప్రభుత్వం(Indiramma Family Insurance Scheme) భావిస్తోంది. కుటుంబంలో ఒక్కరే సంపాదిస్తుంటే ఆ వ్యక్తిని బీమా పరిధిలోకి తీసుకొస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదిస్తుంటే కుటుంబం ఎంపిక చేసుకున్న వ్యక్తికి బీమా కల్పించనుంది.

రూ.5 లక్షలకు పెంపు
ప్రస్తుతం నేత, గౌడ, కార్మిక, మత్స్యకార తదితర వర్గాలకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా సదుపాయం అందుతోంది. ఈ పథకాలను ఇందిరమ్మ కుటుంబ బీమా పరిధిలోకి తీసుకొచ్చి జీవిత బీమా మొత్తాన్ని రూ.5 లక్షలకు(Indiramma Family Insurance Scheme) పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న ప్రమాద బీమా ప్రయోజనాలను కూడా కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం కొన్ని పథకాల కింద అందుతున్న ప్రమాద బీమా ప్రయోజనాలను తొలగించకుండా చూడాలని స్పష్టం చేశారు.

నవంబర్ 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ
నవంబర్ 19న ముఖ్యమంత్రి పథకాన్ని ప్రారంభిస్తారు.. తదుపరి రోజు నవంబర్ 20 నుంచి 30 వరకు గ్రామాల్లో దరఖాస్తుల సేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక ప్రకటనలో వివరాలు వెల్లడయ్యాయి. నమోదు ప్రక్రియలో భాగంగా అర్హులైన కుటుంబాల వివరాలను సేకరించి బీమా పొందే వ్యక్తి, నామినీల వివరాలను నమోదు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ వార్డుల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా వివరాలు సేకరించనున్నారు. అంతేకాకుండా ప్రత్యేక యాప్, ఆన్‌లైన్(Indiramma Family Insurance Scheme) నమోదు ప్రక్రియను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం పథకంలో నమోదు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.పథకం ప్రారంభానికి ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు, ఆన్‌లైన్ నమోదు, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. సుమారు నెల రోజుల పాటు కొనసాగే నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.