ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. గంటపాటు సుదీర్ఘ చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, కరవు నివారణ చర్యలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ప్రధానిని కలిశారు ముఖ్యమంత్రి.

Revanth Reddy Meets Modi
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, కరవు నివారణ చర్యలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi)తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ప్రధానిని కలిశారు ముఖ్యమంత్రి. సుమారు గంటలకుపైగా ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం (Revanth Reddy Meets Modi)అయ్యారు. శాలువా, బహుమతులతో ప్రధానిని సీఎం రేవంత్ సన్మానించారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను, సాగునీటి ప్రాజెక్టుల ఆవశ్యకతను ప్రధానికి కూలంకషంగా వివరించారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
కరవు నివారణకు ప్యాకేజీ..
ఎల్‌నినో(El Niño) ప్రభావం కారణంగా తెలంగాణలో తీవ్ర వర్షాభవ పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. వర్షపాతం తీవ్రంగా పడిపోయిందని, రైతులను ఆదుకునేందుకు తక్షణమే రూ.30 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి (Revanth Reddy Meets Modi)వినతిపత్రం సమర్పించారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య రాష్ట్రంలో సుమారు 17 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు గణాంకాలతో సహా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 31 జిల్లాల్లోని 365 మండలాలను ఇప్పటికే కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించామని తెలిపారు. ఇందులో 111 మండలాలు తీవ్ర కరవు బారిన పడగా, 254 మండలాలు మధ్యస్థాయి కరవును ఎదుర్కొంటున్నాయని వివరించారు. వర్షాభావం వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం 139.28 లక్షల ఎకరాల నుంచి 126.06 లక్షల ఎకరాలకు పడిపోయిందని పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు అనుమతి..
తెలంగాణ జీవనాడి అయిన పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల చిక్కుముడులను విప్పాలని ముఖ్యమంత్రి బృందం ప్రధాని మోదీని కోరింది. 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి, సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని ప్రధానిని(Revanth Reddy Meets Modi) విజ్ఞప్తి చేశారు. సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణానికి త్వరితగతిన పర్యావరణ అనుమతులు (Environmental Clearances) మంజూరయ్యేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. అలాగే గోదావరి – కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును సమ్మక్కసాగర్ లేదా ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలని సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే నీటిలో 50 శాతం వాటాను తెలంగాణకు కేటాయించాలని గట్టిగా కోరారు.
ప్రధానికి ఆహ్వానం..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండు భారీ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆహ్వానించారు. డిసెంబర్ లో 7నుంచి 9వ తేదీ వరకు తెలంగాణలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy Meets Modi)బృందం ఆహ్వానించింది. అలాగే డిసెంబర్ 11–22 జరిగే ఖేలో ఇండియా క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. సోమవారం కూడా దేశ రాజధానిలో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ.. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సుమారు గంటలకు పైగా ప్రధానితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం సాగింది. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
*డిసెంబర్ లో 7నుంచి 9వ తేదీ వరకు తెలంగాణలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఆహ్వానించింది.
* డిసెంబర్ 11–22 జరిగే ఖేలో ఇండియా క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
*ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలోని 365 మండలాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రధానికి వివరించారు సీఎం రేవంత్. దీనిని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి తక్షణమే రూ.30,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు.
* మహారాష్ట్రలోని 152 మీటర్ల తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి అనుమతులు, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, సీతారామ బ్యారేజీకి పర్యావరణ అనుమతుల మంజూరుపై ఈభేటీలో ప్రధానితో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.
* గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో మళ్లించే నీటిలో తెలంగాణకు 50 శాతం వాటా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
@PMOIndia @TelanganaCMO @revanth_anumula @narendramodi @UttamINC @Vakiti_srihari @mansukhmandviya— Telugu Popular TV (@TeluguPopularTV) November 15, 2026
బండి సెటైర్లు
ఇదిలా ఉంటే ప్రధానిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కావడంపై కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజే, ప్రధాని మోదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy Meets Modi)భేటీ కావడం ఆయన గొప్పదనానికి (రాజనీతిజ్ఞతకు) నిదర్శనం అన్నారు బండి సంజయ్. తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి కేంద్ర-రాష్ట్ర సహకారానికి,తెలంగాణ అభివృద్ధికి ప్రధాని ప్రాధాన్యత ఇచ్చారని ప్రశంసించారు. రాజకీయ వైరం కంటే దేశ అభివృద్ధిని మిన్నగా భావించే ఇలాంటి నాయకత్వం ఎంతో ఆదర్శనీయమని మోదీని బండి సంజయ్ పొగిడారు.
Modi Ji: A True Statesman
The magnanimity displayed by Hon’ble Prime Minister Shri @narendramodi ji is a lesson in leadership.
A day after Rahul Gandhi’s vicious campaign against PM, BJP & RSS in Hyderabad, Modi ji met Telangana CM Revanth Reddy prioritising state’s development over politics.
Despite bitter political differences, Modi ji demonstrated the importance of keeping the door open for Centre-State cooperation & Telangana’s development
This is my leader. This is Modi ji!
A leader I admire for placing the nation’s development above political rivalry.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 15, 2026



