గల్లీలోనే లొల్లి.. ఢిల్లీలో దోస్తీ. బీఆర్‌ఎస్‌పై రేవంత్ సెటైర్లు
దేశంలో బీజేపీని సమర్థంగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కారు గుర్తు.. ఢిల్లీకి వెళ్లేసరికి కమలం పువ్వుగా మారుతోందని సీఎం ఎద్దేవా చేశారు

Revanth Slams BJP and BRS
కాంగ్రెస్‌కే ఆసత్తా
దేశంలో బీజేపీని సమర్థంగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కారు గుర్తు.. ఢిల్లీకి వెళ్లేసరికి కమలం పువ్వుగా మారుతోందని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Slams BJP and BRS) ఎద్దేవా చేశారు. కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మోదీని ఓడించడమే కాంగ్రెస్ లక్ష్యమని ప్రకటించారు.
రిజర్వేషన్లపై సవాల్
మైనార్టీల విద్య, ఉద్యోగ అవకాశాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు. పేద విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను రద్దు చేయాలని బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్(Revanth Slams BJP and BRS) ప్రశ్నించారు. మైనార్టీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీజేపీ.. ముందుగా గుజరాత్‌లో వాటిని రద్దు చేసి చూపించాలని సవాల్ విసిరారు. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి, షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు బాధ్యతలు అప్పగించిన విషయాన్ని ప్రస్తావించారు. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామని, క్రీడాకారిణి నిఖత్ జరీన్‌ను కూడా ప్రభుత్వం గౌరవించిందని తెలిపారు.
ఏఐతో ముప్ప.. బ్లూకాలర్‌తో సేఫ్
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాలకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, ఏఐతో భర్తీ చేయలేని బ్లూ కాలర్ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Slams BJP and BRS) అభిప్రాయపడ్డారు. అందుకే రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యువత నైపుణ్యాల కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, క్రీడల అభివృద్ధికి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. మరోవైపు మూసీ పునరుజ్జీవనంతో పాతబస్తీకి పూర్వవైభవం తీసుకొస్తామని, నైట్ ఎకానమీని అభివృద్ధి చేస్తామని, మీరాలం చెరువుపై రూ.600 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని వెల్లడించారు. విద్య, నైపుణ్యాలే యువత భవిష్యత్తుకు బలమైన పునాదులని సీఎం పేర్కొన్నారు.



