అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్.. ధనుష్ హాజరవుతాడా..?
Anirudh Kavya Maran marriage: చెన్నైలో జరుగుతున్న అనిరుద్- కావ్య మారన్ రిసెప్షన్‌కి ధనుష్ వెళ్తాడా..? ఇప్పుడు ఇదే వ్యవహారం తమిళ సినిమా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Anirudh Kavya Maran marriage: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహం ప్రస్తుతం సినీ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ఈ జంట వివాహ వేడుకలు, మరోవైపు ఉద్యోగులకు కావ్య మారన్ అందించిన ప్రత్యేక కానుకలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇదే సమయంలో అనిరుధ్ తన సినీ ప్రయాణంలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ కూడా చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆయనకు తొలి అవకాశం ఇచ్చిన నటుడు ధనుష్ పేరును ప్రస్తావించకపోవడం అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమైంది.
చెన్నైలో రిసెప్షన్‌కి ధనుష్ వెళ్తారా..?
కావ్య మారన్, అనిరుధ్ వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో ఘనంగా జరిగినట్లు సమాచారం. ఈ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న వివాహ రిసెప్షన్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ముఖ్యంగా అనిరుధ్‌తో గతంలో ఎంతో సన్నిహితంగా ఉన్న ధనుష్ ఈ వేడుకకు హాజరవుతారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఇటీవల అనిరుధ్ రవిచందర్ సినీ పరిశ్రమలో 15 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే ఈ పోస్ట్‌లో తన కెరీర్‌కు తొలి అవకాశాన్ని అందించిన ధనుష్ పేరును ప్రస్తావించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అనిరుధ్ కెరీర్‌కు పునాది వేసింది త్రీ
2012లో విడుదలైన త్రీ సినిమాతో అనిరుధ్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలోని వై దిస్ కొలవెరి డి పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఆయన ఒక్కసారిగా స్టార్ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈ సినిమా ద్వారా ధనుష్, అనిరుధ్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అనిరుధ్ సినీ రంగ ప్రవేశం వెనుక ధనుష్ పాత్ర ఎంతో కీలకమని దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అనిరుధ్ తల్లిదండ్రులు అతడిని ఉన్నత చదువుల కోసం సింగపూర్ పంపించాలని భావించిన సమయంలో ధనుష్ అతడిలోని సంగీత ప్రతిభను గుర్తించారని ఆమె తెలిపారు. అలాంటి అనుబంధం ఉన్నప్పటికీ తాజాగా చేసిన పోస్ట్‌లో ధనుష్ పేరు లేకపోవడం అభిమానుల్లో సందేహాలను పెంచుతోంది.
సన్ గ్రూప్ ఉద్యోగులకు కావ్య మారన్ బంగారు కానుకలు
మరోవైపు కావ్య మారన్ తన ఉదారతతో వార్తల్లో నిలుస్తున్నారు. అనిరుధ్‌తో వివాహం సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు ఆమె బంగారు ఉంగరాలను కానుకగా అందించినట్లు సమాచారం. ఉద్యోగులు ఈ బహుమతులు అందుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగులకు అందించిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌లలో వివాహ ఆహ్వాన పత్రికతో పాటు చాక్లెట్లు, బంగారు ఉంగరాలు ఉన్నట్లు వీడియోలను బట్టి తెలుస్తోంది. సాధారణంగా బంగారు నాణేలు అందిస్తారని భావించిన ఉద్యోగులు, వాటికి బదులుగా నేరుగా బంగారు ఉంగరాలు లభించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కానుకలతో ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది.
Kavya Maran-Anirudh Wedding Reception – Gold Ring and Coin gifted to all Sun Network employees.
#KavyaMaran #Anirudh https://t.co/ZH4PfEOand— Star Talkies (@startalkies_ofl) November 21, 2026
నవంబర్ 25న ఉద్యోగులకు ప్రత్యేక విందు
వైరల్ అవుతున్న గిఫ్ట్ బాక్స్‌లోని వివాహ ఆహ్వాన పత్రికలో నవంబర్ 25న మధ్యాహ్న విందు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగులకు అందించిన బంగారు ఉంగరాల బరువు, వాటి విలువ ఎంత అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అలాగే సన్ గ్రూప్‌లో ఎంతమంది ఉద్యోగులకు ఈ కానుకలు అందించారనే విషయంపై కూడా అధికారిక సమాచారం లేదు. అయినప్పటికీ కావ్య మారన్ ఉద్యోగుల పట్ల చూపిన అభిమానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక శనివారం నాడు చెన్నైలో జరగనున్న అనిరుధ్‌కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.



