రాజీనామా బాటలో ఆదినారాయణరెడ్డి? శనివారం తుది ప్రకటన!
ఏపీ బీజేపీలో కుదుపు మొదలైందా? శనివారం బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతుందా? జమ్మలమడుగులో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయబోతున్నారా? ఆదినారాయణ రెడ్డి అలకకు కారణమేంటీ?

Adinarayana Reddy Resignation
ఏపీ రాజకీయాల్లో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ మారింది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి విషయంలో ఆదినారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కడప జడ్పీ పీఠాన్ని టీడీపీకి ఖరారు చేయడంతో డిజాపాయింట్ అయ్యారు. తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయంగా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే తనకు అర సెకన్ కూడా పట్టదన్నారు. ఈ అంశంపై అధిష్ఠానంతో చర్చించాక, తన తుది నిర్ణయాన్ని శనివారం(Adinarayana Reddy Resignation) ప్రకటిస్తానని చెప్పారు. తాను కూటమి కోసం ఎంతో నిబద్ధతతో పనిచేశానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జమ్మలమడుగు పరిధిలో 46 స్థానాలకు గాను 46 స్థానాల్లోనూ విజయం సాధించామని గుర్తుచేశారు. అయితే రాత్రికి రాత్రే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో ఆదినారాయణరెడ్డి స్వయంగా మాట్లాడారు. తన నిర్ణయం మార్చుకోనేది లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వివాదస్పదమైంది. తన సోదరుడి కుమారుడికి జెడ్పీ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించిన జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి నిరాశ ఎదురైంది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించాలని ఆదినారాయణ రెడ్డి మొదటి నుంచి పట్టుబడుతున్నారు. ముఖ్యంగా తన సోదరుడి కుమారుడు డాక్టర్ చదిపిరాళ్ల రాజేష్ రెడ్డికి ఈ పదవి ఇప్పించేందుకు ప్రయత్నించారు. అయితే కూటమి పార్టీల మధ్య జరిగిన చర్చల్లో చివరకు కడప జెడ్పీ చైర్మన్ పదవి టీడీపీకి దక్కింది. టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ పరిణామంతో ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు తన మద్దతుదారులైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో కూడా రాజీనామా(Adinarayana Reddy Resignation) చేయించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.



