నైట్ షిఫ్టులు చేస్తున్నారా? మీ గుండెపై ప్రభావం పడే ఛాన్స్ !
ఐటీ, పారిశ్రామిక రంగాలు, అత్యవసర సేవలు.. ఇలా పలు విభాగాల్లో రాత్రిపూట విధులు నిర్వర్తించే వారికి అలర్ట్. నైట్ షిప్టులు చేసే ఉద్యోగులకు వైద్య పరిశోధకులు కీలక హెచ్చరిక చేశారు. ఏళ్ల తరబడి క్రమం తప్పకుండా నైట్ షిఫ్టులు చేయడం వల్ల గుండె నిర్మాణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని.. తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Night Shift Effects on Heart
ఐటీ, పారిశ్రామిక రంగాలు, అత్యవసర సేవలు.. ఇలా పలు విభాగాల్లో రాత్రిపూట విధులు నిర్వర్తించే వారికి అలర్ట్. నైట్ షిప్టులు చేసే ఉద్యోగులకు
వైద్య పరిశోధకులు కీలక హెచ్చరిక చేశారు. ఏళ్ల తరబడి క్రమం తప్పకుండా నైట్ షిఫ్టులు చేయడం వల్ల గుండె నిర్మాణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని.. తాజా అధ్యయనంలో అది వెల్లడించిందని చెప్తున్నారు. ముఖ్యంగా గుండె కండరాల గోడలు మందంగా మారడం, గుండెలోని(Night Shift Effects on Heart) గదుల పరిమాణం తగ్గడం వంటి మార్పులను శాస్త్రవేత్తలు గుర్తించారు.
42 వేల మందిపై పరిశోధన
నైట్ షిఫ్టులు వల్ల ప్రభావం పడుతుందని ఊరికే చెప్పడం లేదు పరిశోధకులు. సుమారు 42,671 మందిని పరిక్షించాకే.. వారి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించాకే ఈవిషయం వెల్లడించారు. వీరిలో తరచూ రాత్రి వేళల్లో పనిచేసే 1,322 మందిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీరి సగటు వయసు 52 సంవత్సరాలుగా ఉంది. దీర్ఘకాలంగా నైట్ షిఫ్టులు చేసేవారిలో గుండె కండరాల నిర్మాణానికి సంబంధించి కొన్ని మార్పులు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.వీరి గుండె(Night Shift Effects on Heart) నిర్మాణంలో మార్పులు కనిపించినప్పటికీ, దాని ప్రధాన పనితీరుపై పెద్దగా ప్రభావం ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలలేదు.
బాడీ క్లాక్ దెబ్బతింటే గుండెకు ముప్పు?
సాధారణంగా మన శరీరం పగలు చురుగ్గా ఉండటం, రాత్రి విశ్రాంతి తీసుకోవడం అనే సహజ జీవ గడియారం (Body Clock) ఆధారంగా పనిచేస్తుంది. అయితే నిరంతరం రాత్రిపూట మేల్కొని పనిచేయడం వల్ల ఈ జీవ గడియారంలో అంతరాయం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రక్తపోటు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయులు మారడం, కొలెస్ట్రాల్‌తో పాటు ఇతర కొవ్వుల సమతుల్యత దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇవన్నీ దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. వారంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే నైట్ షిఫ్ట్ చేసేవారితో పోలిస్తే, ఏళ్ల తరబడి నిరంతరం రాత్రి విధులు నిర్వహించేవారిలో గుండె(Night Shift Effects on Heart) నిర్మాణపరమైన మార్పులు ఎక్కువగా కనిపించినట్లు అధ్యయనం సూచిస్తోంది.
నైట్ షిఫ్ట్ చేసేవారికి జాగ్రత్తలు!
రాత్రి వేళల్లో విధులు నిర్వహించే కొన్ని ఆరోగ్య నియమాలు పాటించాలని చూస్తున్నారు నిపుణులు.ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేయడం, పని వేళలు ఎలా ఉన్నా రోజుకు 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర పోవాలి. రాత్రి సమయాల్లో నూనెలో వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి.రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయులను ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవాలి.అవసరాన్ని బట్టి వైద్యుల సలహాతో గుండె(Night Shift Effects on Heart) సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
నైట్ షిఫ్ట్ చేస్తే హాట్ ప్రాబ్లం?
నైట్ షిఫ్ట్ చేసే ప్రతి ఒక్కరికీ గుండె జబ్బులు వస్తాయని అధ్యయనం ఎక్కడాలేదు. రాత్రి వేళల్లో పనిచేయడం, గుండె నిర్మాణంలో కనిపించిన మార్పుల మధ్య సంబంధాన్ని మాత్రమే పరిశోధన గుర్తించింది. ఈ మార్పులే గుండె(Night Shift Effects on Heart) జబ్బులకు కారణమవుతాయని నిర్ధారించలేదు.అయితే దీర్ఘకాలంగా నైట్ షిఫ్టులు చేసేవారు తమ నిద్ర, ఆహారం, వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరమని సూచిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు ఆరోగ్యానికీ తగిన ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని చెప్తున్నారు.



