“అయ్ బాబోయ్ బోలెడన్నీ ప్రయోజనాలే.. అయితే ఇవాళే తినేయాలి”
చలికాలంలో మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని, శక్తిని అందించే అద్భుతమైన గుణాలు చిలకడదుంపలో పుష్కలంగా ఉన్నాయి. ఖరీదైన డ్రై ఫ్రూట్స్ లేదా సప్లిమెంట్లతో పనిలేకుండా, చాలా తక్కువ ధరలోనే మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనిని అందుకే"పేదల బాదం" లేదా "నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్" అని పిలుస్తుంటారు.

Sweet Potato Health Benefits
చలికాలం మొదలైంది. అందరూ కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈసీజన్‌లో మన శరీరంలోని రోగనిరోధక శక్తి (Immunity) కాస్త నెమ్మదిస్తుంది.ఫలితంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, సీజనల్ జ్వరాలు వరస పెడతాయి. సులభంగా దాడి చేస్తాయి. అయితే ఇలాంటప్పుడే మనం హెల్త్ ట్రిప్స్ పాటించాలి. అది ఖరీదైన డ్రై ఫ్రూట్స్, సప్లిమెంట్ల కంటే.. మనకు అత్యంత తక్కువ ధరలో, ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ‘వింటర్ సూపర్ ఫుడ్’ చిలకడదుంప (Sweet Potato) తింటే ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు (Nutritionists) చెబుతున్నారు. ఎందుకంటే చలికాలంలో మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని, శక్తిని అందించే అద్భుతమైన గుణాలు ఈ చిలకడదుంపలో పుష్కలంగా ఉన్నాయి. పైగా ఖరీదైన డ్రై ఫ్రూట్స్ లేదా సప్లిమెంట్లతో పనిలేకుండా, చాలా తక్కువ ధరలోనే మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది కాబట్టి దీనిని “పేదల బాదం” లేదా “నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్” అని పిలుస్తుంటారు. దీంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందుతుంది.. అద్భుత ప్రయోజనం కలుగుతుంది.
ఇవాళే మీ డైట్‌లో చిలకడదుంపను చేర్చుకోవడం ద్వారా మీరు అధిక లాభాలు(Sweet Potato Health Benefits) పొందుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
గ్లోయింగ్ స్కిన్: చలికాలంలో వచ్చే చర్మం పొడిబారే సమస్యను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.
బద్ధం దూరం: ఉదయం పూట లేదా ఈవెనింగ్ స్నాక్‌గా తింటే రోజంతా యాక్టివ్‌గా ఉండేలా ఎనర్జీనిస్తుంది.
కడుపు హ్యాపీ: జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, అజీర్తి సమస్యలకు చెక్ పెడుతుంది.
1. ఇమ్యూనిటీ పవర్‌హౌస్..!
చిలకడదుంపలో బీటా-కెరోటిన్ (Beta-Carotene) అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరం దీనిని విటమిన్-ఏగా మార్చుకుంటుంది. ఇది శరీరంలో తెల్ల రక్తకణాల పనితీరును మెరుగుపరిచి, వైరస్‌లతో పోరాడే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా చలికాలంలో చర్మం పొడిబారకుండా కాపాడటంలో, కంటి చూపును మెరుగుపరచడంలోనూ ఇది కీలక పాత్ర(Sweet Potato Health Benefits) పోషిస్తుంది.
2. గట్ హెల్త్ ..!
శీతాకాలంలో శారీరక శ్రమ తగ్గడం వల్ల చాలామంది మలబద్ధకం (Constipation) సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. చిలకడదుంపలో ఉండే కరిగే పీచు పదార్థం (Dietary Fiber) జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియా (Gut Microbiome) వృద్ధికి తోడ్పడి, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.
3. బీపీ కంట్రోల్..!
ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం శరీరంలోని అధిక సోడియం ప్రభావాన్ని తగ్గించి, రక్తపోటును (Blood Pressure) అదుపులో ఉంచుతాయి. అలాగే దీనిలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును దూరం చేస్తుంది.
4. వెయిట్ లాస్.. బెస్ట్ స్నాక్ ..!
చలికాలంలో ఆకలి ఎక్కువగా వేస్తుంటుంది. చిలకడదుంపలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరానికి నెమ్మదిగా, స్థిరమైన శక్తిని (Sustained Energy) అందిస్తాయి. దీనిని తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండటం వల్ల అనవసరపు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా బరువును నియంత్రించుకోవచ్చు.
5. ఒత్తిడి కంట్రోల్:
చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. చిలకడదుంపలో ఉండే మెగ్నీషియం మెదడును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడి (Stress), ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎలా తినాలి?
చిలకడదుంపను నూనెలో వేయించడానికి బదులుగా నిప్పులపై కాల్చి (Roasted) లేదా ఆవిరిపై ఉడికించి (Steamed) తినడం అత్యుత్తమం. ఉడికించిన ముక్కలపై కాస్త నిమ్మరసం, చిటికెడు మిరియాల పొడి లేదా చాట్ మసాలా చల్లుకుని సాయంత్రం పూట హెల్దీ స్నాక్‌గా(Sweet Potato Health Benefits) తీసుకోవచ్చు. తొక్కలో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి, శుభ్రంగా కడిగి తొక్కతో సహా తినడం ఇంకా మంచిది. షుగర్ వ్యాధి (Diabetes) ఉన్నవారు చిలకడదుంపను తినేటప్పుడు పరిమితి పాటించాలి. ఇందులో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి, ఎక్కువ మోతాదులో తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు వైద్యుల సలహా మేరకు దీనిని తీసుకోవాలి. కేవలం ఒక్క ఆహారంతోనే కాకుండా.. తగినంత నీరు తాగడం, వ్యాయామం, కంటినిండా నిద్రతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి.



