దీపావళి స్వీట్ బాక్స్ తెచ్చారా? ఏది తినాలో తెలుసా?
దీపావళి వచ్చేసింది. ఈ నేపథ్యంలో దీపావళి స్వీట్ బాక్స్‌లో ఏ స్వీట్ తింటే జీర్ణవ్యవస్థపై తక్కువ ప్రభావం ఉంటుందో.. వేటిని పరిమితంగా తీసుకోవాలో తెలుసుకుందాం.

Diwali Sweets and Gut Health
దీపావళి వచ్చేసింది. ఇంకేముంది.. ప్రతి ఇంట్లో రకరకాల స్వీట్లు, క్రాకర్స్, దీపాలు దర్శనమిస్తాయి. ఎంత నోరు కట్టేసుకునే వారైనా దీపావళి రోజున కనీసం ఒక్క స్వీట్ అయినా తింటారు. మరికొందరైతే పండుగ కోసం ప్రత్యేకంగా స్వీట్లు తెచ్చుకోవడమో, స్నేహితులు ఇచ్చారనో, ఇంట్లో ఉన్నాయనే కారణంతోనో ఇష్టమొచ్చినట్లు లాగించేస్తుంటారు. అయితే ఈ అలవాటు మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు స్వీట్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, విరేచనాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి (Diwali Sweets and Gut Health)స్వీట్ బాక్స్‌లో ఏ స్వీట్ తింటే జీర్ణవ్యవస్థపై తక్కువ ప్రభావం ఉంటుందో.. వేటిని పరిమితంగా తీసుకోవాలో తెలుసుకుందాం.
స్వీట్ పాయిజన్!
చాలామంది స్వీట్లు తినేటప్పుడు వాటిలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయనే విషయాన్నే పరిశీలిస్తారు. కానీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపే ఇతర అంశాలను పట్టించుకోరు. నెయ్యి, నూనె ఎక్కువగా ఉండే స్వీట్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కడుపులో ఆహారం ఎక్కువసేపు ఉండి ఎసిడిటీ, గుండెల్లో మంట సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఖోవా, పాలతో తయారుచేసే స్వీట్లలో లాక్టోస్ ఉంటుంది. కొందరిలో ఇది సరిగ్గా జీర్ణం కాక గ్యాస్, కడుపునొప్పి, విరేచనాలకు కారణమవుతుంది. ఇక అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు స్వీట్ల(Diwali Sweets and Gut Health) విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. శనగపిండి, జీడిపప్పు వంటి పదార్థాల్లో ఉండే కొన్ని కార్బోహైడ్రేట్లు కూడా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో గ్యాస్ సమస్యను పెంచవచ్చు.
దేంతో తక్కువ ప్రమాదం?
కాజు కట్లీ: పరిమితంగా తీసుకుంటే ఓకే. అయితే ఇందులోనూ చక్కెర, కొవ్వు ఉంటాయని గుర్తుంచుకోవాలి.
రసగుల్లా: పాకం తీసేసి తింటే చక్కెర తీసుకునే పరిమాణం కొంత తగ్గుతుంది. వేయించిన స్వీట్లతో పోలిస్తే ఇందులో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది.
గులాబ్ జామ్: నూనెలో వేయించి పాకంలో ముంచడం వల్ల ఇందులో కొవ్వు, చక్కెర రెండూ ఎక్కువగా ఉంటాయి. ఎసిడిటీ సమస్య ఉన్నవారు వీటిని పరిమితంగా తీసుకోవాలి.
బూందీ లడ్డూ: శనగపిండి, నెయ్యి, చక్కెరతో తయారుచేసే ఈ స్వీట్‌ను ఎక్కువగా తింటే కొందరిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రావచ్చు.
ఖోవా స్వీట్లు: పాల పదార్థాలతో తయారుచేయడం వల్ల లాక్టోస్ సరిగ్గా జీర్ణం కానివారికి ఇబ్బందులు కలిగించవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే.. ఏ స్వీట్ అయినా మితంగా తినడమే మంచిది. ఒకటి రెండు చిన్న ముక్కలతో సరిపెట్టుకోవాలి. భోజనం చేసిన తర్వాత స్వీట్లు(Diwali Sweets and Gut Health) తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో ఎక్కువ మొత్తంలో స్వీట్లు తినడం, రాత్రి పడుకునే ముందు భారీగా స్వీట్లు తీసుకోవడం తగ్గించుకోవాలి. టోటల్‌గా చెప్పాలంటే ఏ స్వీట్ కూడా పూర్తిగా ఆరోగ్యకరమైనది కాదు.



