కార్తీక మాసం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ధర
చికెన్, కోడిగుడ్ల ధరలకు భారీగా బ్రేక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో నాన్‌వెజ్ ధరలు భారీగా దిగొచ్చాయి.

Chicken Prices in Two States
చికెన్, కోడిగుడ్ల ధరలకు భారీగా బ్రేక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో నాన్‌వెజ్ ధరలు భారీగా దిగొచ్చాయి. కార్తిక మాసం కొనసాగుతుండటంతో పాటు అయ్యప్ప, శివమాల దీక్షలు చేపట్టిన భక్తులు మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో చికెన్‌కు డిమాండ్ గణనీయంగా పడిపోయింది. మరోవైపు పౌల్ట్రీ ఫారాల నుంచి సరఫరా మాత్రం యథావిధిగా కొనసాగుతుండటంతో మార్కెట్లో ధరలు(Chicken Prices in Two States) తగ్గాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.300 దాటగా.. ప్రస్తుతం దాదాపు రూ.50 వరకు తగ్గింది. చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా దిగిరావడంతో మాంసాహార ప్రియులకు కొంత ఊరట లభిస్తోంది.
హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.252గా ఉండగా, డ్రెస్డ్ చికెన్ రూ.223 పలుకుతోంది. రిటైల్ లైవ్ బర్డ్ ధర రూ.144, ఎక్స్-ఫామ్ లైవ్ బర్డ్ ధర రూ.117గా ఉంది. ఇక డజను కోడిగుడ్ల ధర గతంలో రూ.90 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.74కు చేరింది. విజయవాడ మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.249, డ్రెస్డ్ చికెన్ రూ.220గా నమోదైంది. రిటైల్ లైవ్ బర్డ్ ధర రూ.142, ఫామ్ లైవ్ బర్డ్ ధర రూ.115 వద్ద కొనసాగుతుండగా.. డజను గుడ్ల ధర రూ.80గా ఉంది. కార్తిక మాసం ముగిసే వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం(Chicken Prices in Two States) ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో దీక్షల విరమణతో పాటు క్రిస్మస్ పండుగ సీజన్ ప్రారంభం కానుండటంతో చికెన్, గుడ్లకు డిమాండ్ మళ్లీ పెరగవచ్చని, ఫలితంగా ధరలు తిరిగి పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.



