బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. వాయుగుండంగా మారే ఛాన్స్!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.ఇప్పుడిప్పుడే అర్నబ్ తుఫాను ప్రభావం నుంచి కోలుకుంటున్న ఏపీకి మరో వాతావరణ ముప్పు పొంచి ఉందా? అనే చర్చ మొదలైంది. దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో నవంబర్ 29 నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

Bay of Bengal Low Pressure
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.ఇప్పుడిప్పుడే అర్నబ్ తుఫాను ప్రభావం నుంచి కోలుకుంటున్న ఏపీకి మరో వాతావరణ ముప్పు పొంచి ఉందా? అనే చర్చ మొదలైంది. దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో నవంబర్ 29 నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీని ప్రభావంతో నవంబర్ 30 నాటికి అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం(Bay of Bengal Low Pressure) పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఈ పరిణామాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా వెల్లడించింది.
డిసెంబర్ 2న వాయుగుండం!
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. అల్పపీడనం ఏర్పడిన తర్వాత క్రమంగా బలపడుతూ డిసెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు(Bay of Bengal Low Pressure) ప్రయాణించే అవకాశం ఉందని సూచిస్తోంది. అయితే దీని తీవ్రత, దిశ, తీరానికి చేరుకునే సమయంపై ఇంకా స్పష్టత లేదు. వాయుగుండంగా బలపడే అవకాశాలపైనా వాతావరణ శాఖ అంచనాల్లో కొంత అనిశ్చితి ఉంది.
ఏపీ ప్రజలకు కీలక అప్డేట్!
కొత్త అల్పపీడనం ప్రభావంతో దక్షిణ భారత ద్వీపకల్ప ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 3 నుంచి 9 మధ్య తమిళనాడు, కేరళలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా విస్తృత పరిధి వాతావరణ అంచనాలో(Bay of Bengal Low Pressure) పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వర్షాల తీవ్రత, ప్రభావిత ప్రాంతాలపై తదుపరి బులెటిన్లలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



