AP Cyclone Alert

ఏపీకి మరో తుపాన్ గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లో తుపానుగా బలపడనుంది. ఆ తర్వాత మరింత తీవ్రరూపం దాల్చి ఏపీ తీరంవైపు దూసుకొచ్చే అవకాశం ఉంది. నవంబర్ 17 సాయంత్రానికి తీవ్ర తుపానుగా, ఆ తర్వాత అతితీవ్ర తుపానుగా బలపడే అవకాశాలున్నాయి. నవంబర్ 19, 20 తేదీల్లో ఏపీ తీరప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నెల్లూరు నుంచి తుని మధ్య నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది.
దని తాజా అంచనాలు చెబుతున్నాయి. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని ఐఎండీ (AP Cyclone Alert)హెచ్చరించింది. రాష్ట్రంలో ఏర్పడున్న ఈ తుపానుకు ‘అక్వాన్’ (Akvan) అనే పేరు పెట్టనున్నారు. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు నుంచి తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

గంట గంటకూ పెరుగుతున్న తీవ్రత
నవంబర్ 15 అర్ధరాత్రి సమయంలో అల్పపీడన వ్యవస్థ తీవ్ర వాయుగుండంగా బలపడింది. నవంబర్ 16వ తేదీ ఉదయం 11.30 గంటల సమయానికి ఇది ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. గంటకు సుమారు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 16 సాయంత్రానికి ఇది తుపానుగా మారే అవకాశం ఉంది. నవంబర్ 17 సాయంత్రానికి తీవ్ర తుపానుగా (AP Cyclone Alert)బలపడనుంది. ఆ తర్వాత కూడా బలాన్ని పెంచుకుంటూ నవంబర్ 19 రాత్రికి అత్యంత తీవ్ర తుపానుగా మారి ఏపీ తీరానికి చేరువయ్యే అవకాశం ఉంది.

నవంబర్ 20న తీరం దాటే ఛాన్స్
తాజా ఐఎండీ అంచనాలు ఏపీ తీరప్రాంతాలకు కీలక హెచ్చరికను జారీ చేస్తున్నాయి. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు నుంచి తుని మధ్య ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో వర్షాలు తీవ్రతరం కానున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ(AP Cyclone Alert) పేర్కొంది. ముఖ్యంగా 24 గంటల్లో 21 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా అప్రమత్తత అవసరం. నవంబర్ 18 కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 19 కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 20న తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. రాయలసీమలో(AP Cyclone Alert) నవంబర్ 19, 20 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తెలంగాణ నవంబర్ 20న తూర్పు తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, 21న అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం.

తీరప్రాంతాల్లో 145 కిలోమీటర్ల వేగంతో గాలులు
ఏపీ, యానాం తీరాల వెంబడి నవంబర్ 17 వరకు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నవంబర్ 19 ఉదయం వరకు గాలుల వేగం క్రమంగా 60-70 కిలోమీటర్లకు పెరగవచ్చు. నవంబర్ 19 రాత్రి నుంచి 20వ తేదీ మధ్యాహ్నం వరకు గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు(AP Cyclone Alert) వీచే ప్రమాదం ఉంది. సముద్రం కూడా అత్యంత అల్లకల్లోలంగా మారనుంది. నవంబర్ 19 సాయంత్రం నుంచి 20వ తేదీ ఉదయం వరకు సముద్ర పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉండవచ్చని ఐఎండీ హెచ్చరించింది.

ఆరు జిల్లాలకు ప్రత్యేక తుపాను ముప్పు
తుపాను తీరం దాటే సమయంలో ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలకు సముద్రపు అలల ఉప్పెన (Storm Surge) ముప్పు ఉందని ఐఎండీ హెచ్చరించింది. సముద్రపు అలల ఉప్పెన సాధారణ అలల మట్టం కంటే 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది.

పంటలు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం జరిగే అవకాశం
తుపాను సమయంలో బలమైన గాలుల కారణంగా పూరిళ్లు, తాత్కాలిక నిర్మాణాలు, రేకుల ఇళ్లకు నష్టం కలగవచ్చు. చెట్లు, కొమ్మలు విరిగిపడటం, విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ (AP Cyclone Alert)వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది. అరటి, బొప్పాయి, కొబ్బరి తోటలు, ఇతర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, రహదారులపై వరద నీరు ప్రవహించడం, రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మత్స్యకారులకు హెచ్చరిక.. సముద్రంలోకి వెళ్లొద్దు!
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. నైరుతి బంగాళాఖాతంలో(AP Cyclone Alert) నవంబర్ 16 నుంచి 19 వరకు, మధ్య బంగాళాఖాతంలో నవంబర్ 16 నుంచి 20 వరకు, వాయవ్య బంగాళాఖాతంలో నవంబర్ 19, 20 తేదీల్లో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో అధికారులు ముందస్తు అప్రమత్తత చర్యలు చేపట్టాలని సూచించింది.