Giribabu Political Journey

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా 600కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన సీనియర్ నటుడు గిరిబాబు రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరంగా సాగింది. వెండితెరపై ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన ఆయన, రాజకీయ రంగంలోనూ (Giribabu Political Journey)వివిధ పార్టీలతో అనుబంధం కొనసాగించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వరకు ఆయన రాజకీయ ప్రయాణం రాష్ట్ర రాజకీయ పరిణామాలకు అనుగుణంగా సాగింది.

NTRతో అనుబంధం..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం,NTR రాజకీయ ప్రస్థానం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలికాయి. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచారు. ఆటైంటో ఎన్టీఆర్ ఉన్న అనుబంధం కారణంగా గిరిబాబు(Giribabu Political Journey) కూడా టీడీపీతో రాజకీయ అనుబంధం కలిగి ఉన్నారు.

YSRపై అభిమానం..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై గిరిబాబుకు ప్రత్యేక అభిమానం. వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర, ప్రజలతో ఆయనకు ఏర్పడిన అనుబంధం, సంక్షేమ కార్యక్రమాలు గిరిబాబును ఆకర్షించాయి. 2009లోనే వైఎస్ రాజశేఖరరెడ్డికి మద్దతుగా నిలిచానని ఓ ఇంటర్వూలో గిరిబాబే(Giribabu Political Journey) తెలిపారు. వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబ రాజకీయ ప్రయాణానికి ఆయన మద్దతు కొనసాగించారు.

జగన్ పై మమకారం
గిరిబాబు రాజకీయ జీవితంలో 2012 మే నెల కీలకమైన మలుపుగా నిలిచింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన అధికారికంగా చేరారు. 2012 మే 1న హైదరాబాద్‌లో జగన్ సమక్షంలో గిరిబాబు(Giribabu Political Journey) వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో చేరిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లోనూ, రాజకీయ సమావేశాల్లోనూ ఆయన పాల్గొన్నారు. సినీ కళాకారులతో పార్టీకి మద్దతు కూడగట్టే కార్యక్రమాల్లో కూడా చురుగ్గా వ్యవహరించారు. 2012 ఆగస్టులో వైఎస్సార్‌సీపీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ, టీవీ కళాకారులు, సాంకేతిక నిపుణుల సమావేశంలో గిరిబాబు పాల్గొన్నారు. ఆ సందర్భంగా వైఎస్సార్‌సీపీని విజయవంతమైన రాజకీయ శక్తిగా అభివర్ణిస్తూ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై విమర్శలు చేశారు. వైఎస్సార్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కళాకారులకు సూచించారు. జగన్ నాయకత్వంపై తనకు విశ్వాసం ఉందని, సినీ రంగం నుంచి మరికొందరు కూడా పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని అప్పట్లో వ్యాఖ్యానించారు. గిరిబాబు నటనకు 2022లో సాక్షి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. ఆయన సినీ జీవితంలో 50 సంవత్సరాల ప్రస్థానం, తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించింది.

బహిరంగ మద్దతు
2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గిరిబాబు(Giribabu Political Journey) జగన్‌కు తన మద్దతును బహిరంగంగా ప్రకటించారు. 2020లో జగన్ ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా మాట్లాడుతూ, ఎన్టీఆర్ తర్వాత వైఎస్సార్, ఇప్పుడు వైఎస్ జగన్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకులుగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని 15ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో అప్పట్లో గిరిబాబు రాజకీయ వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది. అయితే ఏరాజకీయ పార్టీ తరపున ఆయన ఎప్పుడు పోటీ చేయలేదు.

జగన్ సంతాపం
గిరిబాబు మృతి పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. గిరిబాబుతో తమ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని వైఎస్ జగన్ గుర్తుచేసుకున్నారు. “నాన్నగారికి మంచి స్నేహితుడు, మా పార్టీలో క్రియాశీలక సభ్యుడైన ప్రముఖ నటుడు గిరిబాబు గారి మరణవార్త ఎంతో బాధించిందంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. ఆయన తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు గిరిబాబు అందించిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు జగన్.