AP Heavy Rains Forecast for 7 Days

అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. కోస్తాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అర్నబ్ సృష్టించిన బీభత్సంతో ప్రజలు అల్లాడిపోతుంటే.. వాతావరణ శాఖ మరో బాంబ్‌ లాంటి వార్త చెప్పంది. రాష్ట్రానికి మరో ఏడు రోజుల పాటు భారీ వర్ష సూచన (AP Heavy Rains Forecast for 7 Days)చేసింది. మరో వారం రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరించింది. దీంతో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డటైంది ఏపీ పరిస్థితి. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్ల కుండపోత వర్షపాతం నమోదైన ఆశ్చర్యపోనక్కలేదని తెలిపింది. తీరం వెంబడి గంటలకు 110 కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మరీ ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు మరి అలర్ట్‌గా ఉండాలని సూచించింది. వెనువెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించింది. రాయలసీమలోను రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

7గురు మృతి..
అర్నబ్ తుపాను ఇప్పటికే కోస్తాంధ్రలో బీభత్సవం సృష్టించింది. బాపట్ల నుంచి మొదలుకొను మన్యం జిల్లా వరకు కుండపోత వర్షాలు దంచికొడుతున్నాయి. ఈదురుగాలుల తీవ్రతకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడిన ఘటనల్లో 7గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. కుండపోత వర్షాలతో పలు చోట్ల రాకపోకలు బంద్‌ అయ్యాయి. తీర ప్రాంతాల్లో రక్షణ గోడలు కూలాయి. ఏజెన్సీల్లో వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రాజెక్ట్‌లు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్‌ సెంటర్‌కి వెళ్లి అక్కడ నుంచే నేరుగా సమీక్ష (AP Heavy Rains Forecast for 7 Days)చేస్తున్నారు. అన్ని జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడి అక్కడి తాజా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తున్నారు. నేతలు కూడా ఎక్కడిక్కడ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని .. తుపాను బాధితులకు అండగా నిలవాలని సూచించారు.

పార్టీ శ్రేణులకు పవన్ విజ్ఞప్తి..

మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ .. జనసేన పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యల్లో పాలుపంచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారులకు అండగా నిలవాలన్నారు. మరోవైపు కాకినాడ జిల్లా కలెక్టర్‌తో పవన్‌ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. కోస్తా జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువ చూపిందని అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. రహదారులపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాల తొలగింపులో సిబ్బందికి సహకరించాలని పార్టీ కేడర్‌కి విజ్ఞప్తి చేశారు పవన్‌.

రైళ్లు, విమానాలు రద్దు..
హోంమంత్రి అనిత తుపాను ప్రభావి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న చర్యలపై అనిత ఆరా తీశారు. మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్న అధికారులను హోంమంత్రి ప్రశంసించారు. అర్నబ్ తొలగిపోయేవరకు ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు సూచించారు. అర్నబ్ ప్రభావంతో ఇప్పటికే 33 విమానాలను (AP Heavy Rains Forecast for 7 Days)రద్దు చేశారు. భోగాపురం, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి నడుస్తున్న సర్వీసులను క్యాన్సిల్ చేశారు. మరోవైపు 100 సంఖ్యలో రైళ్లు రద్దు అయ్యాయి. తుపాను ప్రభావంతో రైళ్లను రద్దు చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది.