Andhra Pradesh Cyclone Alert

అర్నబ్ చేసిన గాయం ఇంకా మానలేదు.. తుపాన్‌ దాటికి విరిగిన చెట్లు పూర్తిగా తొలగించనే లేదు. ఇంకా పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరగనేలేదు. ఇంతలోనే మరో బాంబ్ పేల్చింది ఐఎండీ. ఏపీకి మరో తుపాన్‌ హెచ్చరిక చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (Andhra Pradesh Cyclone Alert)హెచ్చరించింది.

దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం నమోదైంది. ప్రస్తుతం ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్, నికోబార్ దీవుల ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని అధికారులు తెలిపారు. అల్పపీడనం అక్టోబర్ 31 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ఒక వాయుగుండంగా కేంద్రీకృతం కానుంది. వాయుగుండంగా మారిన తర్వాత రానున్న రెండు రోజుల్లో ఏపీ తీరం వైపుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో ఏపీ తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని.. మత్స్యకారులు తగిన జాగ్రత్తలు(Andhra Pradesh Cyclone Alert) తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. వాయుగుండం తీరానికి ఎంత దూరంలో కేంద్రీకృతమవుతుంది. ఎలాంటి ప్రభావం చూపుతోందో మరో 48 గంటల్లో స్పష్టంగా తెలుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

తుపాన్‌ పై గత నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. నిన్నటి నుంచి తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండో రోజు మొగల్తూరు ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటించారు. మరి ముఖ్యంగా పంట నష్టపోయిన రైతులను కలిశారు. తుపాన్‌ కారణంగా జరిగిన నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చివరి బాధితుడికి సాయం అందే వరకు మిశ్రమించకుండా పనిచేస్తామని హామీ ఇచ్చారు. బాధితులను ఆదుకోవడమే ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. తుపాన్‌ కారణంగా మృతి చెందిన కుటుంబాలను కలిసి ఓదార్చారు. మరోవైపు
తుపాన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, 16 జిల్లాల్లో 3,52,254 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 23,211 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టంపై వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నాయి. వారికి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని వివరించి, గరిష్ఠంగా కేంద్ర సహాయం పొందేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కోనసీమ, పశ్చిమ గోదావరిలో సుమారు 500 పైగా గ్రామాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాటిని పునరుద్దరించే పనిలో ఉన్నారు అధికారులు. మరోవైపు తుపాన్‌ ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురిసిన వర్షాలకు పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. మహేంద్రతనయ ఉప్పొంగడంతో చుపక్కల గ్రామాలు జలదిగ్బంధంలో(Andhra Pradesh Cyclone Alert) చిక్కుకున్నాయి. అర్నబ్‌ తుపాన్‌ ప్రభావంతో పలుచోట్ల రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయాయి. రైల్వేశాఖ శుక్ర, శని, ఆదివారాల్లో మొత్తం 6 రైళ్లను రద్దు చేసింది. శుక్రవారం కొన్ని రైళ్లను రీషెడ్యూల్‌ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.