సీత పాత్ర నాలో మార్పు తెచ్చింది.. నాజన్మ ధన్యమైంది
రామాయణ చిత్రంలో సీత పాత్రపై నటి సాయిపల్లవి తొలిసారి స్పందించారు.సీతగా నటించడం తన జీవితంలో మరిచిపోలేని అనుభవమన్నారు. సీతగా నటించడం వల్ల నాజన్మ ధన్యమైందన్నారు.

Sai Pallavi Ramayana Movie
రామాయణ చిత్రంలో సీత పాత్రపై నటి సాయిపల్లవి తొలిసారి స్పందించారు.సీతగా నటించడం తన జీవితంలో మరిచిపోలేని అనుభవమన్నారు. సీతగా నటించడం వల్ల నాజన్మ ధన్యమైందన్నారు. ఈ పాత్ర తనపై వ్యక్తిగతంగా ఎంతో ప్రభావం చూపిందన్నారు. తనలో కొన్ని మార్పులకు కారణమైందని(Sai Pallavi Ramayana Movie) తెలిపారు. తాజాగా ‘వి ది ఉమెన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. ‘‘నా జీవితం ఒక సినిమా తర్వాత మరో సినిమాతో సాగిపోతుంటుంది. అయితే ప్రతి పాత్ర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం. సీత పాత్ర కూడా నాలో కొన్ని వ్యక్తిగత మార్పులు తీసుకొచ్చింది. అయితే వాటి గురించి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు’’ అని సాయిపల్లవి పేర్కొన్నారు.
ఇక ‘రామాయణ’లో తన సీతమ్మ లుక్‌పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపైనా ఆమె స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న చర్చలు తన దృష్టికి వస్తున్నాయని స్పష్టం చేశారు. ‘‘ప్రతి ఒక్కరికీ వారి అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. వాటిని కేవలం అభిప్రాయాలుగానే చూడాలి. విమర్శలను ఎదుర్కొంటూ మరింత ధైర్యంగా, బలంగా మారాలి. అప్పుడే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లగలం. కేవలం అందానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు నాకు(Sai Pallavi Ramayana Movie) నచ్చవు. అలాంటి పాత్రలను నేను ఎంచుకోను. నా నిర్ణయమే నాకు సరైన మార్గాన్ని చూపిస్తుంది’’ అని తెలిపారు. ఇతరుల విమర్శల కంటే మనలోని ఆత్మవిశ్వాసమే ముఖ్యమని, అంతర్గతంగా దృఢంగా ఉన్నప్పుడే బయటి నుంచి వచ్చే అనవసర వ్యాఖ్యలను పక్కనపెట్టి ముందుకు సాగగలమని సాయిపల్లవి అభిప్రాయపడ్డారు.



