Nitesh Tiwari Clarifies Sita Warrior Role

భారతీయ ఇతిహాసం ఆధారంగా దర్శకుడు నితేశ్ తివారీ (Nitesh Tiwari) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana). ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునానీ సృష్టిస్తోంది. అటు నిర్మాతకు కనక వర్షం కురిపిస్తోంది. సీతమ్మగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. అయితే, నవంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన నాటినుంచి సోషల్ మీడియాలో సీతపాత్ర ట్రోల్ అవుతోంది. ఈ చిత్రంలో సీతమ్మను కేవలం సుకుమారిగానే కాకుండా, ఆయుధం పట్టి పోరాడే ‘యోధురాలి’గా (Warrior) చూపించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ విమర్శలకు ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు నితేశ్ తివారీ(Nitesh Tiwari Clarifies Sita Warrior Role) ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

ఆగ్రంథాల స్ఫూర్తితోనే ..
రామాయణ కథను ఎక్కడా వక్రీకరించలేదని స్పష్టం చేశారు నితేశ్‌ తివారీ. ప్రాచీన గ్రంథాల ఆధారంగానే సీతమ్మ పాత్రను తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. మన దేశంలో వాల్మీకి రామాయణంతో పాటు ఎన్నో ప్రాంతీయ రామాయణాలు ప్రాచుర్యంలో ఉన్నాయని చెప్పారు. సంస్కృతంలోని అద్భుత రామాయణం, 15వ శతాబ్దానికి చెందిన ఒడియా బిలంక రామాయణంలో సీతమ్మ కేవలం కష్టాలను భరించే సహనశీలి మాత్రమే కాదు.. అవసరమైతే కదనరంగంలో దూకే అపర శక్తి స్వరూపిణి(Nitesh Tiwari Clarifies Sita Warrior Role) అని ఆయన వివరించారు. యుద్ధభూమిలో శ్రీరాముడికి ఆపద ఎదురైనప్పుడు, సీతమ్మ మహాకాళి రూపాన్ని ధరించి సహస్ర రావణుడిని సంహరిస్తుందని చెప్పారు. అలాంటి శక్తిమంతమైన కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ పోరాట సన్నివేశాలను జోడించాని క్లారిటీ ఇచ్చారు.

యుద్ధ విద్య కొత్తేమీ కాదు..
ఈ చిత్రంలో కైకేయి పాత్రలో మెప్పించిన బాలీవుడ్ నటి లారా దత్తా కూడా సీత యుద్ద సన్నివేశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన కాలంలో క్షత్రియ, రాజకుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలకు కూడా కళలతో పాటు ఆత్మరక్షణ, యుద్ధ విద్యల్లో కఠిన శిక్షణ ఇచ్చేవారని గుర్తుచేశారు. మిథిలాధిపతి జనక మహారాజు కుమార్తె అయిన సీతమ్మకు(Nitesh Tiwari Clarifies Sita Warrior Role) యుద్ధ విద్య తెలిసి ఉండటంలో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. దీనిని ఒక గొప్ప దృశ్యకావ్యంగా.. సినిమాను సినిమాలా చూసి ఆస్వాదించాలని సూచించారు.

రెండో భాగంపై అంచనాలు
రూ. 800 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి(Nitesh Tiwari Clarifies Sita Warrior Role), రావణుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్, శూర్పనకగా రకుల్‌ ప్రీత్‌సింగ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటించారు. ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం తొలి భాగం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది. పదిరోజుల్లో 1200 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఇతిహాస గాథ సెంకడ్ పార్ట్ 2028 దీపావళి కానుకగా విడుదల కానుంది. దీనిపై మరింత అంచనాలు నెలకొన్నాయి.