కనక వర్షం.. యూకే, ఐర్లాండ్ కలెక్షన్ల సునామీ
బాక్సాఫీస్ దగ్గర రామాయణ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల క్లబ్‌కు చేరువైంది. నితేశ్ తివారీ డైరెక్షన్లో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మైథలాజికల్ ఎపిక్.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రామాయణ వసూళ్లలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

Ramayana Box Office Collection
వసూళ్ల జోరు
బాక్సాఫీస్ దగ్గర రామాయణ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల క్లబ్‌కు చేరువైంది. నితేశ్ తివారీ డైరెక్షన్లో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మైథలాజికల్ ఎపిక్.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రామాయణ వసూళ్లలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. నవంబర్ 5న విడుదలైన ఈ సినిమా.. మొదటి ఏడు రోజుల్లోనే భారత్‌లో రూ.511.10 కోట్ల నెట్ వసూళ్లు(Ramayana Box Office Collection) సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.934.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వెయ్యి కోట్ల మైలురాయికి కేవలం రూ.65.45 కోట్ల దూరంలో నిలిచింది. నవంబర్ 12 నాటి తాజా ట్రేడ్ అప్డేట్ ప్రకారం.. ఎనిమిదో రోజు హిందీ వెర్షన్ రూ.400 కోట్ల నెట్ మార్కును కూడా దాటింది.
#Ramayana 7 Days Worldwide Collection ₹964 CRORES+ GROSS 🔥🔥🔥🔥🔥🔥
#Yash #RanbirKapoor #RamayanaMovie https://t.co/pDRjiUbgDj
— Asian Box Office (@AsianBoxOffice) November 12, 2026
యూకే, ఐర్లాండ్ హిస్టరీ
భారతీయ సినిమా సత్తాను రామాయణ సినిమా అంతర్జాతీయ బాక్సాఫీస్ దగ్గర మరోసారి చాటిచెప్పింది. యూకే, ఐర్లాండ్ బాక్సాఫీస్ చరిత్రలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. నవంబర్ 6 నుంచి 8 వరకు జరిగిన ఫస్ట్ వీకెండ్లో ఏకంగా 2.14 మిలియన్ పౌండ్ల వసూళ్లు సాధించింది. జపాన్ చిత్రం ‘గాడ్జిల్లా మైనస్ జీరో’తో పాటు హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. సోనీ పిక్చర్స్ పంపిణీ చేసిన ఈ సినిమా 361 థియేటర్లలో రిలీజ్ అయింది. ఒక్కో థియేటర్లో సగటున 5,951 పౌండ్ల వసూళ్లు((Ramayana Box Office Collection) ) వచ్చాయి. ప్రివ్యూ ప్రదర్శనల ద్వారా 337 ప్రాంతాల్లో 4,35,875 పౌండ్లు సమకూరాయి. ఇప్పటివరకు యూకే, ఐర్లాండ్ బాక్సాఫీస్ చార్టులో భారతీయ సినిమాలు రెండో స్థానానికే పరిమితమయ్యాయి. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, ‘ధురంధర్ ఈ ఘనత సాధించాయి. తాజాగా ‘రామాయణ’ వాటన్నింటినీ అధిగమించింది. ఈ సినిమా దెబ్బకు గత వారం అగ్రస్థానంలో ఉన్న డిస్నీ సినిమా ‘వైల్డ్ హార్స్ నైన్’ రెండో స్థానానికి పడిపోయింది. అది ఫస్ట్ వీకెండ్లో 1.47 మిలియన్ పౌండ్లు వసూలు చేసింది. జపాన్ చిత్రం ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ 1.39 మిలియన్ పౌండ్లతో మూడో స్థానంలో నిలిచింది. నవంబర్ 12న హాంకాంగ్, మెక్సికో, మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో విడుదల కానుంది. నవంబర్ 19న బ్రెజిల్, ఇటలీ, ఉక్రెయిన్, హంగేరీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 20న పోలండ్‌లో, నవంబర్ 26న అర్జెంటీనా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ సహా లాటిన్ అమెరికాలోని మరికొన్ని దేశాల్లో విడుదల చేయనున్నారు.
మరికొన్ని దేశాల్లో…
ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించారు. జటాయువుకు అనుపమ్ ఖేర్ గాత్రం అందించారు. రాముడి బాల్యం నుంచి సీతాపహరణం వరకు తొలి భాగంలో కథను ఆవిష్కరించారు. ఇక రెండో భాగాన్ని 2028 దీపావళికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి భారీ తారాగణం, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రామాయణ(Ramayana Box Office Collection) .. వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం పక్కాగా కనిపిస్తోంది.



