Dhanush Praises Sai Pallavi

ధనుష్‌ సపోర్ట్
రామాయణ సినిమా ఇప్పుడు దేశంలో పెద్ద హాట్ టాపిక్. ఈచిత్రం గురించి ఇప్పుడు పాజిటివ్‌ అయినా.. నెగిటివ్‌ అయినా.. ఏదీ మాట్లాడినా సంచలనమే. దీపావళి కానుకగా నవంబర్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొంది.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈసినిమా పోస్టర్ వదిలినప్పటి నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా సీత పాత్రపై చర్చ జరుగుతూనే ఉంది. నటి సాయిపల్లవి ఎంపికపై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. అయితే ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో దనుష్ మాత్రం సాయిపల్లవిని ఆకాశానికి ఎత్తారు. సీత పాత్రలో ఆమెను మించిన నటి మరొకరు లేరని ప్రశంసించారు. ఆమె నటన, అంకితభావం, భక్తి అద్భుతం అని కొనియాడారు. సీత పాత్రలో సాయిపల్లవి(Dhanush Praises Sai Pallavi) నటనపై వస్తున్న విమర్శలను చూసి ఆశ్చర్యం కలిగిందన్నారు ధనుష్‌. ఇదే సమయంలో ఆమెతో ఉన్న మెమోరీస్ ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. భగవంతుడిపై సాయి పల్లవికి అపారమైన భక్తి ఉందని.. షూటింగ్ సమయంలోను ఆమె ఎప్పడూ ప్రార్థనలు చేస్తూనే ఉంటుందని చెప్పారు. చూడటానికి అందంగా ఉండడమే కాదు.. ఆమె మనసు వెన్నఅని కితాబిచ్చారు. నటన విషయంలో అల్టిమేట్ అని ప్రశంసించారు. గతంలో మారి 2లో నటించినప్పుడు చాలా మౌనంగా కనిపించేవారిని.. కెమెరా ఆన్‌ చేసినప్పుడు మాత్రమే మాట్లాడేవారిని .. అప్పటికీ ఇప్పటికీ చాలా ఛేంజ్‌ అయ్యారని చెప్పారు. యాక్టింగ్ విషయంలో కంప్లీట్‌గా అద్భుతం అన్నారు. సీత పాత్రలో ఆమె ఒదిగిపోయారని.. ఆపాత్రకే వన్నే తెచ్చారని పొగడ్తలతో ముంచెత్తారు. సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కి ధనుష్‌ కౌంటర్ ఇచ్చారు.

వివాదానికి కారణాలేంటీ..!
బాలీవుడ్‌లో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో సీత కాస్టింగ్ ప్రకటన నుంచే వివాదం నడుస్తోంది. ఆపాత్రకు దక్షిణాది నటి సాయిపల్లవిని ఎలా ఎంపిక చేస్తారని .. ఆమె లుక్, మేకప్, నటన, ఆమె బాష గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సీతాదేవి రూపం తమ సంప్రదాయ భావనలకు సాయిపల్లవి రూపం సరిపోవడం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. రామాయణ ట్రైలర్ విడుదలైన తర్వాత సాయిపల్లవి సీత లుక్‌పై విమర్శలు మరింత పెరిగాయి. ఆమె ముఖ కవళికలు, సహజమైన జుట్టు, మేకప్, వస్త్రధారణపై కొందరు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీత పాత్రలో ఆమె కనిపిస్తున్న తీరును శూర్పణఖ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ రూపంతో పోలుస్తూ కొందరు పోస్టులు పెట్టారు. సాయిపల్లవి ఎంపికపై వివాదానికి మరో కారణం భాష. 2026 ఏప్రిల్‌లో తన చిత్రం ‘ఏక్ దిన్’ ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే హిందీని స్పష్టంగా మాట్లాడలేకపోవడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హిందీ సరిగ్గా మాట్లాడలేని ఆమెకు సీత పాత్ర ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న భారీ చిత్రంలో భాష విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ వివాదంలో మరో ఆసక్తికరమైన అంశం ప్రాంతీయత. దక్షిణాది నటిని ఉత్తర భారతీయ ఇతిహాసంలోని ప్రధాన పాత్రకు ఎంపిక చేయడంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. ఇక తీరా సినిమా విడుదలైన తర్వాత సాయిపల్లవి పాత్రకు సంబంధించి మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అరణ్యవాసంలో రాముడితో కలిసి సీత రాక్షసులతో పోరాడుతున్నట్లు చూపించిన సన్నివేశంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాల్మీకి రామాయణంలో ఖరదూషణులతో జరిగిన యుద్ధ సమయంలో సీతను లక్ష్మణుడు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఉంటుందని, కాని సినిమాలో మాత్రం ఆమెను యుద్ధంలో పాల్గొన్నట్లు చూపించడం కథకు భిన్నమని విమర్శిస్తున్నారు. మొత్తంగా చూస్తే..
సాయిపల్లవి(Dhanush Praises Sai Pallavi) ఎంపిక చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు పలు కోణాల్లో చర్చకు దారితీసింది.