Ram Charan Sukumar RC17 Casting Call

సినిమాల్లో నటించాలని కలలు కంటున్నారా? అయితే మీకు ఇది గుడ్‌న్యూస్! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం RC17లో నటించే అవకాశం ఔత్సాహిక కళాకారులకు లభించనుంది. ఈ సినిమా కోసం కొత్త నటీనటులను ఎంపిక చేసేందుకు చిత్రబృందం కాస్టింగ్ కాల్(Ram Charan Sukumar RC17 Casting Call) విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్న కొత్త ముఖాలు తమ వివరాలను పంపించాలని కోరింది. దీంతో వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం దక్కినట్లయింది.


16 నుంచి 60 ఏళ్ల వారికి అవకాశం!
RC17 సినిమాలోని వివిధ పాత్రల కోసం 16 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు, పురుషుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది మూవీ టీం. ముఖ్యంగా కొత్తవారికి(Ram Charan Sukumar RC17 Casting Call) కూడా అవకాశం కల్పించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. నటనపై ఆసక్తి ఉన్నవారు తమ ప్రతిభను నిరూపించుకునేలా ఒక యాక్టింగ్ వీడియోను సిద్ధం చేసి పంపించాలిని తెలిపింది.

వీడియో ఎక్కడికి పంపించాలి?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ తమ యాక్టింగ్ వీడియోను src17casting@gmail.com అనే ఈమెయిల్ చిరునామాకు లేదా 9110564651 వాట్సాప్ నంబర్‌కు పంపించాలని తెలిపింది. రామ్ చరణ్, సుకుమార్ వంటి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటించే అవకాశం(Ram Charan Sukumar RC17 Casting Call) రావడంతో ఈ కాస్టింగ్ కాల్‌పై ఆసక్తి నెలకొంది. అయితే దరఖాస్తులకు చివరి తేదీ, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. సో ఇంకేందుకు ఆలస్యం మీ టాలెంట్ నిరోపించుకోండి.