Varanasi Release Date Postpone

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కలయికలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌ ‘వారణాసి’ ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా రెండు వార్తలు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఒకటి ఓటీటీ హక్కులకు వస్తున్న భారీ ఆఫర్ కాగా, మరొకటి సినిమా విడుదల వాయిదా(Varanasi Release Date Postpone) పడే అవకాశం ఉందనే  ప్రచారం.

ఓటీటీ హక్కుల కోసం భారీ ఆఫర్?
‘వారణాసి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ హక్కులను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ మేరకు చిత్ర నిర్మాతలు, నెట్‌ఫ్లిక్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈ నెలలోనే ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ భారీ డీల్‌పై ఇప్పటివరకు చిత్ర నిర్మాణ సంస్థ నుంచి గానీ, రాజమౌళి నుంచి గాని ఎలాంటి అధికారిక(Varanasi Release Date Postpone) ప్రకటన వెలువడలేదు.

విడుదల వాయిదా పడుతుందా?
మరోవైపు ఈ సినిమా విడుదల తేదీపై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.అయితే సినిమా నిర్మాణంలో భాగంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులకు మరింత సమయం పడుతోందని, దీంతో విడుదలను జులై లేదా ఆగస్టు నెలలకు మార్చే అవకాశాలను(Varanasi Release Date Postpone) పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.