బిగ్ బాస్ తెలుగు 10: వర్షిణి ముఖంపై కాఫీ కొట్టిన సుధీర్
Bigg Boss Telugu Season 10: బిగ్‌బాస్ సీజన్ ఫైనల్స్‌కు వస్తున్న కొద్దీ రోజురోజుకు గేమ్ రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ వ్యూహాలు రచిస్తున్నారు. ఇంతకీ వర్షణిపై సుధీర్ కాఫీ ఎందుకు పోశాడో తెలుసా..?

Bigg Boss Telugu Season 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంటుండటంతో హౌస్‌లో ఆట మరింత రసవత్తరంగా మారుతోంది. ఇప్పటివరకు గ్రూపులుగా కలిసి ప్రయాణించిన కంటెస్టెంట్లు ఇప్పుడు వ్యక్తిగతంగా తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కంటెస్టెంట్లు మాటల యుద్ధానికి దిగారు. ముఖ్యంగా వర్షిణి-సుధీర్ మధ్య గొడవ, దేబ్జానీ-రామ్ ప్రసాద్ నామినేషన్ వివాదం, అమన్‌తో దేబ్జానీ వాగ్వాదం ఎపిసోడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వర్షిణిని నామినేషన్.. అబ్బో మామూలుగా లేదు
ఈ నామినేషన్ల ప్రక్రియలో వర్షిణి, సుధీర్ మధ్య జరిగిన వాగ్వాదం హాట్ టాపిక్‌గా మారింది. రివార్డ్ రివేంజ్ టాస్క్‌లో వర్షిణి వ్యవహరించిన తీరును తప్పుబడుతూ సుధీర్ ఆమెను నామినేట్ చేశాడు. తాను, శ్వేత కలిసి బాల్స్ వేస్తున్నారని మిగతా కంటెస్టెంట్లు భావించడంతో వారికి బాల్స్ ఇచ్చానని వర్షిణి తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. మరోవైపు రామ్ ప్రసాద్ సైతం ముకేష్‌కు మద్దతు లభిస్తుందనే కారణంతో ఆ సమయంలో వర్షిణి తనకు సహకరించలేదని ఆరోపించాడు. అయితే సుధీర్ మాత్రం వర్షిణి తన తప్పును అంగీకరించకుండా ఇతరుల పేర్లు చెబుతోందని విమర్శించాడు. దీనికి వర్షిణి కూడా ధీటుగా సమాధానమిచ్చింది. సొంత ఆటపై దృష్టి పెట్టకుండా ఇతరుల ఆట గురించి మాట్లాడుతున్నాడని సుధీర్ మండిపడటమే కాకుండా.. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది.చివరకు సుధీర్ వర్షిణి ముఖంపై కాఫీ కొట్టి ఆమెను నామినేట్ చేయడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.
కెప్టెన్సీ విషయంలో విభేదాలు
మరోవైపు దేబ్జానీ, రామ్ ప్రసాద్ మధ్య జరిగిన నామినేషన్ కూడా హౌస్‌లో చర్చకు దారితీసింది. కెప్టెన్సీ తనకు ఎంత ముఖ్యమో తెలిసినప్పటికీ, ఆ సమయంలో రామ్ ప్రసాద్ తనకు మద్దతు ఇవ్వలేదని కారణం చెబుతూ అతడిని దేబ్జానీ నామినేట్ చేసింది. దీనిపై రామ్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు కెప్టెన్సీ అవకాశం వస్తే దేబ్జానీనే కెప్టెన్‌గా చేయాలని భావించేవాడినని చెప్పాడు. అయితే గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ఇంత స్వార్థంగా వ్యవహరిస్తుందని అనుకోలేదని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఇక నామినేషన్ల ప్రక్రియలో కెప్టెన్ అమన్, దేబ్జానీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో అమన్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. దేబ్జానీ తీరుపై అమన్ కూడా తీవ్రంగా స్పందించడంతో ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. చివరి దశకు చేరుకున్న సమయంలోనూ కంటెస్టెంట్లు వెనక్కి తగ్గకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటంతో హౌస్‌లో ఉద్రిక్తత నెలకొంది.
శివ్.. ముఖేష్ ఆటపై తీవ్ర విమర్శలు
ఈ వారం నామినేషన్లలో శివ్, ముకేష్ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. త్రిగుణ్‌కు బయట మంచి క్రేజ్ ఉందనే అంచనాతో అతడితో గొడవలు పెట్టుకోవడం ద్వారా స్క్రీన్ స్పేస్ సంపాదించేందుకు శివ్ ప్రయత్నిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారం మొత్తం ప్రశాంతంగా ఉంటూ నామినేషన్ల సమయంలో మాత్రమే దూకుడుగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక డిక్టేటర్‌గా ముకేష్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు నామినేషన్లలో ఉన్న ముకేష్‌ను ఈసారి నరేష్, రామ్ ప్రసాద్ వంటి కంటెస్టెంట్లు కూడా టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 10 ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ హౌస్‌లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.మరి ఈ పరిణామాలు కంటెస్టెంట్ల ఓటింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి..ఎవరి ప్రయాణానికి బ్రేక్ పడుతుందనేది రాబోయే ఎపిసోడ్లలో తేలనుంది.



