బిగ్ బాస్ 10.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
Bigg Boss elimination: శనివారం కావడంతో ఇవాళ బిగ్‌బాస్ ఎలిమినేషన్‌పై సస్పెన్స్ నెలకొంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది..

Bigg Boss elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 75 రోజుల ఆట పూర్తికాగా, మరో 25 రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో హౌస్‌లో టాప్ 5 బెర్తుల కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 11వ వారం నామినేషన్లు కంటెస్టెంట్లకు కీలకంగా మారాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఓటింగ్‌లో ఎవరు ముందంజలో ఉన్నారు..? ఎవరికి ఎలిమినేషన్ ముప్పు పొంచి ఉంది..? అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు…?
ఇక 11వ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే తక్కువ ఓట్లు సాధించే కంటెస్టెంట్లకు ప్రమాదం తప్పేలా లేదు. త్రిగుణ్, ముకేష్ టాప్ స్థానాల కోసం పోటీపడుతుండగా, దేబ్జానీ, అమన్ కూడా మెరుగైన స్థానాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మిగిలిన కంటెస్టెంట్లలో ఎవరు డేంజర్ జోన్లో పడతారనేది కీలకంగా మారింది. సుధీర్, నీతూ మాస్టర్, వార్షిణి, శివ, రామకృష్ణలలో ఎవరైనా ఈ వారం లేదా రాబోయే వారాల్లో ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్‌పై స్పష్టత రావాలంటే చివరి వరకు ఓటింగ్ కీలకం కానుంది.
టాప్ ప్లేస్ కోసం త్రిగుణ్, ముకేష్ మధ్య పోటీ
ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఆటను పరిశీలిస్తే త్రిగుణ్, ముకేష్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. వీరిద్దరూ టైటిల్ రేసులో ముందున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ వారం ఇద్దరికీ డిక్టేటర్ బాధ్యతలు అప్పగించడం కూడా ఆసక్తిని పెంచింది. దీంతో వీరిలో ఒకరు విజేతగా, మరొకరు రన్నరప్‌గా నిలిచే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓటింగ్ ట్రెండ్స్‌లో కూడా ఈ ఇద్దరి మధ్యే టాప్ ప్లేస్ కోసం పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే వీరికి అభిమానుల మద్దతు ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి.
టాప్ 5లో దేబ్జానీ, అమన్‌కు అవకాశం..!
టాప్ 5 రేసులో ముకేష్, త్రిగుణ్‌తో పాటు దేబ్జానీ, అమన్ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దేబ్జానీ తన ఆటతీరుతో పాటు ప్రవర్తనతోనూ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్ అభిమానుల మద్దతు కూడా ఆమెకు కలిసొచ్చే అంశంగా మారింది. అందుకే టాప్ 5లో ఆమెకు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు అమన్ మసూద్ ఫిజికల్ టాస్కుల్లో తన సత్తా చాటుతున్నాడు. ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే ఆటలో చురుగ్గా కనిపిస్తుండటంతో టాప్ 5 రేసులో అతడికి కూడా మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ముకేష్, త్రిగుణ్, దేబ్జానీ, అమన్ టాప్ 4లో ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఐదో స్థానం కోసం ఎనిమిది మంది పోటీ
ఇక టాప్ 5లో మిగిలిన ఒక్క స్థానం కోసం మాత్రం ఆసక్తికరమైన పోటీ నెలకొంది. సుధీర్, నీతూ మాస్టర్, వార్షిణి, శివ, రామకృష్ణ, రామ్ ప్రసాద్, నరేష్, వంశీ ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఎవరు చివరి బెర్త్‌ను దక్కించుకుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వంశీకి త్రిగుణ్‌తో ఉన్న సాన్నిహిత్యం, హౌస్‌లో అతడికి లభిస్తున్న ప్రాధాన్యత కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే త్రిగుణ్ ఓటింగ్‌పై ప్రభావం పడుతుందనే అంచనాల నేపథ్యంలో వంశీ టాప్ 5లో ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వంశీకి అవకాశం లేకపోతే మిగిలిన వారిలో రామ్ ప్రసాద్, నరేష్ మధ్య పోటీ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిద్దరిలో నరేష్‌కు హోస్ట్ నాగార్జున నుంచి పలుమార్లు మంచి ప్రశంసలు, ఎలివేషన్లు లభించాయి. ఆటలో అతడి ప్రదర్శనకు కూడా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. మరీ ఈ సారి బిగ్ బాస్ ఫైనల్లో ఎవరు గెలుస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది..



