ఆటైంలో నవ్వాల్సింది కాదు.. ఇంకేప్పుడు అలా చేయను
నటి రాధికా ఆప్టే వ్యాఖ్యలపై నెలకొన్న వివాదానికి హీరోయిన్ కీర్తి సురేశ్ వివరణ ఇచ్చారు. రాధికా ఆప్టే మాట్లాడిన సమయంలో ఆమె ఉద్దేశం తనకు పూర్తిగా అర్థం కాలేదని అన్నారు. దక్షిణాది సాంప్రదాయాలను ఎప్పుడు కించపరచనని స్పష్టం చేశారు.

Keerthy Suresh Radhika Apte Controversy
సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వారి నోటి నుంచి ఏచిన్న తప్పుదొర్లినా.. పెద్ద చర్చకు దారితీస్తాయి. ముఖ్యంగా భాష, ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన వ్యాఖ్యలైతే చాలా సెన్సిటివ్. అవి సోషల్ మీడియాలో మరింత వేగంగా వైరల్ అవుతాయి. తాజాగా హీరోయిన్ కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురవుతున్నారు. నటి రాధికా ఆప్టేతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల సమయంలో కీర్తి నవ్వుతూ కనిపించడంతో ఆమెపై కూడా విమర్శలు(Keerthy Suresh Radhika Apte Controversy) వెల్లువెత్తుతున్నాయి. విమర్శల నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది కీర్తి. అసలా తప్పు ఎందుకు జరిగిందో పూర్తిగా వివరించింది.
వివాదం ఎక్కడ మొదలైంది?
కొద్ది రోజుల క్రితం రాధికా ఆప్టే ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. గతంలో ఓ తెలుగు సినిమాలో తనకంటే ఎక్కువ వయసున్న హీరోతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందన్నారు. అంతేకాదు, కథలో భాగంగా తన మేనమామను వివాహం చేసుకునే పాత్రలో కనిపించాల్సి వచ్చిందని సెటైర్లు వేశారు.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో(Keerthy Suresh Radhika Apte Controversy) పెద్ద చర్చ దారితీశాయి. దక్షిణాది కుటుంబ సంప్రదాయాలను కించపరుస్తూ రాధికా ఆప్టే వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఎక్కుతున్నారు జనాలు. అయితే అదే సమయంలో ఆమె పక్కనే ఉన్న కీర్తి సురేశ్ నవ్వుతూ కనిపించింది. దీంతో రాధికా కామెంట్స్‌తో పాటు కీర్తి నవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
కీర్తి సురేశ్ వివరణ?
తాజాగా తన కొత్త సినిమా ‘సత్యవాన్ సావిత్రి’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న కీర్తి సురేశ్ ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలను తాను వెంటనే అర్థం చేసుకోలేకపోయానని వివరించారు. ఆ తర్వాత రాధికా దక్షిణాది సంప్రదాయాల గురించి ప్రస్తావిస్తున్నారని అర్థమైందన్నారు. మన దక్షిణాది సంస్కృతి, ఆచార వ్యవహారాలను తాను ఎప్పుడూ భంగం కలించనని.. తక్కువ చేసి మాట్లాడబోనని కీర్తి(Keerthy Suresh Radhika Apte Controversy) స్పష్టం చేశారు. ఉత్తరాది ప్రాంతాలకు చెందిన వారికి దక్షిణాది సంప్రదాయాల గురించి పూర్తి అవగాహన లేకపోవచ్చని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరోవైపు రాధికా ఆప్టే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. కీర్తి ఇచ్చిన తాజా వివరణతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతోందేమో చూడాలి.
#KeerthySuresh Replies to a Question About #RadhikaApte’s Comments on the Murai Maaman Culture:
“I didn’t understand what she meant when she said that she had to marry her uncle in a film. Only later did I realise that she was talking about the culture. With all due respect, I will never let down our culture there sir.. I can only explain it to them because they don’t know about it. I cannot prove to them that this is our culture. I don’t know about Karnataka.. I was just saying it as an information that this culture exists in TamilNadu and Andhra. Kerala doesn’t have this culture..” https://t.co/IbEhGZA0jP
— Laxmi Kanth (@iammoviebuff007) November 18, 2026



