త్రివిక్రమ్ ద్రోహం చేశారు..! మాటల మాంత్రికుడిపై నటి మాటల దాడి
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పొన్నాడ పూజిత సంచలన ఆరోపణలు చేసింది. తనకు సినిమాలో మంచి పాత్ర ఇస్తామని నమ్మించి మోసం చేశారని ఆరోపించింది.

Pujita Ponnada On Trivikram
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పొన్నాడ పూజిత సంచలన ఆరోపణలు చేసింది. తనకు సినిమాలో మంచి పాత్ర ఇస్తామని నమ్మించి మోసం చేశారని ఆరోపించింది. గురూజీ, వెంకీ కాంబినేషన్లో వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమాలో కీలక రోల్ ఇస్తానని చెప్పి .. చివరకు ఒక్క సీన్‌కే పరిమితం చేశారని ఆమె ఆరోపించారు. అంతేకాదు, సినిమా విడుదలయ్యాక తనకు సరైన క్రెడిట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఆదర్శకుటుంబం’ సినిమా ప్రేక్షకులను మెప్పించకపోగా.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. అసలుకే సినిమా ఫలితంపై విమర్శలు వస్తుండగా.. తాజాగా నటి పూజిత పొన్నాడ(Pujita Ponnada On Trivikram) చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
త్రివిక్రమ్ అనగానే ఎగ్జైట్ అయ్యా!
తాను యూకేలో ఉండగా.. త్రివిక్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పారు పూజిత పొన్నాడ. త్రివిక్రమ్ తో సినిమా అనగానే ఎగ్జైట్‌తో హైదరాబాద్ వచ్చేసి ఆడిషన్లో పాల్గొనన్నాని చెప్పారు. ఫోటోషూట్లు పూర్తి అయ్యాక త్రివిక్రమ్ తనను ఎంపిక చేశారని తెలిసిందన్నారు. ఆతర్వాత తన పాత్ర గురించి సుమారు గంటన్నరపాటు నెరేషన్ ఇచ్చారని చెప్పారు. ఆదర్శ కుటుంబం సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన పాత్ర ఉంటుందని చెప్పడంతో మంచి అవకాశం దక్కిందని భావించానన్నారు. అలాగే మొదటి షెడ్యూల్లోనే తనను షూటింగ్ పలిచారన్నారు. ఆతర్వాత మూడు నెలల వరకు ఎలాంటి మెసేజ్ లేదన్నారు పూజిత. ఈక్రమంలో కథలో మార్పులు జరుగుతున్నాయని.. నటీనటుల మార్పులు కూడా జరుగతున్నాయని తెలియడంతో షాక్ గురయ్యానన్నారు. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్‌కి ఫోన్ చేసి పరిస్థితి ఎంటని అడిగాన్ననారు. అప్పుడు అతడు మీ పాత్ర తగ్గడం కాదు.. ఇంకా పెరుగుతుందని.. మీ పాత్ర కోసం త్రివిక్రమ్(Pujita Ponnada On Trivikram) మరింత బాగా రాస్తున్నారని చెప్పిరని పూజిత అన్నారు.
నాప్లేస్లో వేరేవారికి ఛాన్స్..!
షూటింగ్‌కి విరామం వచ్చింది. ఇంతలోనే విదేశాలకు వెళ్లే ప్లాన్ ఉండడంతో షూటింగ్ అప్డేట్ తెలుసుకోవడం కోసం మరోసారి చిత్ర బృందాన్ని సంప్రదించానని చెప్పారు పూజిత. అయితే అప్పుడు తనకు స్ఫష్టమైన ఆన్సర్ వారి దగ్గర నుంచి రాలేదని..చివరకు మరో అసిస్టెంట్ డైరెక్టర్‌కి కాల్ చేయగా.. తన పాత్రలో వేరేవారిని తీసుకున్నట్లు చెప్పారన్నారు. కనీసం తనకు ముందుగా సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా సినిమా విడుదలైన తర్వాత చూసుకుంటే తాను కేవలం ఒక్క సీన్లో మాత్రమే కనిపించానని పూజిత ఆరోపించారు. అంతేకాదు, సినిమాలో తనకు తగిన గుర్తింపు, క్రెడిట్ కూడా ఇవ్వలేదని వాపోయారు. మంచి పాత్ర ఉంటుందని నమ్మించి చివరకు ఇలా చేయడం ద్రోహం చేసినట్లేనని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె ఆరోపణలకు అటు నిర్మాత, కాని డైరెక్టర్(Pujita Ponnada On Trivikram) కాని ఎలాంటి ఆన్సర్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



