ఎన్టీఆర్- అనిల్ రావిపూడి సినిమాలో బ్రహ్మానందం..?
Jr NTR and Anil Ravipudi upcoming movie: జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో కమెడియన్‌గా బ్రహ్మనందం ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.

Jr NTR and Anil Ravipudi upcoming movie: టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజీ కాంబినేషన్లలో జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయిక ఒకటి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ తోడైతే వెండితెరపై పండగే అని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా ఈ కాంబినేషన్‌కు సంబంధించి కొన్ని గాసిప్స్ నందమూరి అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా భాగం కానున్నారనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్టీఆర్- బ్రహ్మానందం.. మరోసారి అదుర్స్ రిపీట్..!
ఎన్టీఆర్‌కు కామెడీ చేయడం కొత్తేమీ కాదు. ఆయన టైమింగ్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో కామెడీ సన్నివేశాలను కూడా అద్భుతంగా పండించగలరు. గతంలో అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్, బ్రహ్మానందం కలిసి చేసిన సందడి ప్రేక్షకులను ఇప్పటికీ నవ్విస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చారి పాత్రలో ఎన్టీఆర్ చేసిన కామెడీకి ప్రత్యేకమైన అభిమానులున్నారు. అయితే అదుర్స్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి మరోసారి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అలరించే సినిమా చేయలేదు. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వీరిద్దరి కాంబినేషన్ మరోసారి తెరపైకి రాబోతోందనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనిల్ రావిపూడికి కామెడీని తనదైన శైలిలో పండించడంలో మంచి పట్టుంది. అలాంటి దర్శకుడి చేతిలో ఎన్టీఆర్, బ్రహ్మానందం ఉంటే నవ్వులకు కొదవ ఉండదని అభిమానులు ఆశిస్తున్నారు.
కల్యాణ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్‌కు కథ వినిపించిన అనిల్
ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా కథను ఎన్టీఆర్‌కు వివరించడంతో పాటు, నందమూరి కల్యాణ్ రామ్‌కు కూడా కథ వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. కథలోని కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలు ఎన్టీఆర్‌కు బాగా సరిపోయేలా ఉన్నాయని టాక్. సినిమాలో బ్రహ్మానందం పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉండనుందని చర్చ జరుగుతోంది. అదే నిజమైతే ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్‌ను కూడా జోడిస్తే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా మారడం ఖాయం.
త్రివిక్రమ్‌కి ఎన్టీఆర్ బ్రేక్ ఇస్తారా..?
ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం అందరిలోనూ ఉన్న ప్రధాన సందేహం ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారనేదే. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. మరోవైపు అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై కూడా ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుండటంతో ఎన్టీఆర్ సినిమా షెడ్యూల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. మరి డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి అనిల్ రావిపూడి ప్రాజెక్టును మెయిన్ ట్రాక్‌లోకి తీసుకొస్తారా.. లేక ముందుగా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసిన తర్వాతే అనిల్ రావిపూడితో సెట్స్‌పైకి వెళ్తారా.. అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అభిమానుల్లో భారీ అంచనాలు
ఒకవైపు ప్రశాంత్ నీల్‌తో భారీ యాక్షన్ సినిమా, మరోవైపు త్రివిక్రమ్‌తో విభిన్నమైన కథ.. వీటి మధ్య అనిల్ రావిపూడితో పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తే ఎన్టీఆర్ అభిమానులకు మంచి ట్రీట్ అనే చెప్పాలి. ముఖ్యంగా బ్రహ్మానందంతో మరోసారి ఎన్టీఆర్ కామెడీ పంచుకుంటే అదుర్స్ నాటి జ్ఞాపకాలు మళ్లీ తెరపైకి రావడం ఖాయం. మరి అలాంటి సినిమాను ట్రాక్ ఎప్పుడ ఎక్కిస్తారనే దానిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే..



