HanuMan 2 The Rise of Vanaras

హనుమాన్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ‘హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’ పేరుతో కొత్త సినిమా(HanuMan 2 The Rise of Vanaras)ను ప్రకటించింది. ఈసారి మెగా మేనల్లుడు, ఉప్పెన హీరో పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించనున్నాడు. విభిన్నమైన ఫాంటసీ కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

హనుమాన్ వారసత్వంలో మరో అడుగు!
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తన ఫాంటసీ సినిమా ప్రపంచాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ‘హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు భారీ ఫాంటసీ ప్రాజెక్టులో భాగం కావడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’,‘ఒక్క క్షణం’,‘డిస్కో రాజా’,‘ఊరు పేరు భైరవకోన’వంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించారు. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ అంశాలను కలిపి కథలు చెప్పడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. ఈ నేపథ్యంలో ‘ది రైజ్ ఆఫ్ వానరాస్’ను(HanuMan 2 The Rise of Vanaras) ఆయన ఏ తరహాలో తెరకెక్కిస్తారన్న ఆసక్తి నెలకొంది.

నిర్మాతలు ఎవరు?
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ‘హనుమాన్’ సినిమాను కూడా ఇదే సంస్థ నిర్మించింది. పెద్ద స్థాయిలో ఫాంటసీ ప్రపంచాన్ని(HanuMan 2 The Rise of Vanaras) సృష్టించే లక్ష్యంతో ఈ కొత్త ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు నిర్మాతల ప్రకటన ద్వారా తెలుస్తోంది.

ఆకట్టుకున్న పోస్టర్‌
సినిమా టైటిల్ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తిని పెంచుతోంది. దట్టమైన మేఘాల మధ్య ఓ వ్యక్తి పైకి ఎగురుతున్నట్లు, అతని చుట్టూ భారీ దివ్యమైన వానర తోక కనిపిస్తున్నట్లు పోస్టర్‌ను రూపొందించారు. ఆకాశంలో కనిపించే దైవిక ఆకృతి, మిస్టిక్ వాతావరణం సినిమా పురాణ, ఫాంటసీ(HanuMan 2 The Rise of Vanaras) నేపథ్యాన్ని సూచిస్తున్నాయి. ‘ది రైజ్ ఆఫ్ వానరాస్’ అనే టైటిల్ కూడా ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తోంది. వానరుల ప్రపంచం, వారి శక్తులు, పురాణ నేపథ్యంలోని అంశాలు సినిమాలో ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.

ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’?
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ ప్రాజెక్టు వేరు. అది 2024లో విడుదలైన ‘హనుమాన్’ చిత్రానికి ప్రకటించిన కొనసాగింపు. ఇందులో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. మరోవైపు ‘హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’ను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. దీనికి వీఐ ఆనంద్ దర్శకుడు. వైష్ణవ్ తేజ్ హీరో. అంటే ‘జై హనుమాన్’, ‘ది రైజ్ ఆఫ్ వానరాస్’ (HanuMan 2 The Rise of Vanaras)రెండూ వేర్వేరు ప్రకటనలు, వేర్వేరు చిత్ర బృందాలతో రూపొందుతున్న ప్రాజెక్టులు. ‘ది రైజ్ ఆఫ్ వానరాస్’కు ‘హనుమాన్’ సినిమాతో ఉన్న కథాపరమైన సంబంధం ఏమిటన్నది మాత్రం ఇంకా అధికారికంగా స్పష్టం కాలేదు.

మరిన్ని వివరాలు!
ప్రస్తుతం టైటిల్, హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థ వివరాలు వెల్లడయ్యాయి. ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు, సాంకేతిక బృందం, సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు.. విడుదల తేదీ వంటి వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి ‘హనుమాన్’ విజయంతో ఫాంటసీ సినిమాలపై ప్రేక్షకుల్లో పెరిగిన ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ మరో భారీ ప్రయత్నానికి(HanuMan 2 The Rise of Vanaras) సిద్ధమైంది. వైష్ణవ్ తేజ్‌ను సరికొత్త ఫాంటసీ ప్రపంచంలో చూపించనున్న ఈ సినిమా ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.