శర్వానంద్, డింపుల్ హయాతి మధ్య ఏదైనా ఉందా..?
Sharwanand–Dimple Hayathi Wedding Rumours: డింపుల్ హయాతీ, శర్వానంద్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. శర్వానంద్, డింపుల్‌కి పెళ్లి అయిపోయిందంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు అదిరిపోయే సమాధానం ఇచ్చారు హీరోయిన్..

Sharwanand Dimple Hayathi Wedding Rumours: హీరో, హీరోయిన్ కలిసి సినిమాలో నటించారంటే చాలు.. సినిమా విడుదల కాకముందే వాళ్ల మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ మొదలైపోతాయి. ఇక సినిమా రిలీజ్ అయ్యి హిట్టా, ఫట్టా అన్నది తేలే వరకు ఈ గాసిప్స్‌కు బ్రేకులు పడవు. ఇప్పుడు ఇదే కోవలోకి చేరిపోయారు శర్వానంద్, డింపుల్ హయాతీ. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోతో డింపుల్ హయాతీ కనిపించిన సాన్నిహిత్యం, వాళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్లీ బాండింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఒక్కసారిగా డింపుల్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అసలు సినిమా ప్రమోషన్స్‌లో కనిపించిన ఈ ఫ్రెండ్షిప్‌కు కొందరు మరో అర్థం తీస్తూ రూమర్స్ మొదలుపెట్టేశారు. ఇంకేముంది.. శర్వానంద్‌తో డింపుల్ హయాతీ పెళ్లి అంటూ కథనాలు, గాసిప్స్ తెరపైకి వచ్చేశాయి. సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఈ జోడీ గురించి ఇంత చర్చ జరగడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
డింపుల్ హయాతితో శర్వానంద్ పెళ్లి.. ?
టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరో శర్వానంద్, హీరోయిన్ డింపుల్ హయాతి పేర్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరూ కలిసి నటిస్తున్న భోగి సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఓ ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. శర్వానంద్, డింపుల్ హయాతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. శర్వానంద్ 2023లో రక్షితారెడ్డిని వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే కొంతకాలంగా శర్వానంద్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయన భార్య రక్షితారెడ్డితో విడిపోయారంటూ, విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని ప్రచారాలు వినిపిస్తున్నాయి.
డింపుల్ హయాతి కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
మరోవైపు శర్వానంద్ నటిస్తున్న భోగి సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించారు. ఈ సందర్భంగా డింపుల్ హయాతి శర్వానంద్ వైపు వంగి మాట్లాడుతున్న క్యాండిడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఓ నెటిజన్ శర్వానంద్‌లాగే డింపుల్ హయాతికి కూడా పెళ్లయిపోయిందని కామెంట్ చేయగా, తనకు ఇంకా పెళ్లి కాలేదంటూ డింపుల్ సరదాగా స్పందించారు. ఆమె ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భోగి ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మరింత రచ్చ
డింపుల్ హయాతి తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పడంతో కొందరు నెటిజన్లు శర్వానంద్‌తో ఆమెకు పెళ్లి జరగబోతోందా అనే కోణంలో చర్చలు మొదలుపెట్టారు. ఇప్పటికే శర్వానంద్ వైవాహిక జీవితంపై విడాకుల రూమర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే భోగి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడం, డింపుల్ సరదాగా స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఇదిలా ఉంటే శర్వానంద్, డింపుల్ హయాతి కలిసి నటిస్తున్న భోగి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నవంబర్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ల సమయంలో వీరిద్దరి పేర్లు ఇలా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చర్చల్లోకి రావడం ఆసక్తికరంగా మారింది.



