Ramayana Movie Ticket Price

నిన్నటి వరకు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో సంచలనం సృష్టించిన ‘రామాయణ’ మూవీ ఇప్పుడు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మైథలాజికల్ విజువల్ ఎపిక్‌ను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్రబృందం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. నేటి నుంచి థియేటర్లలో కేవలం రూ.99 నుంచే సినిమా చేసేలా వీలు కల్పించింది. గతంలో ప్రధాన నగరాల్లో 2డీ షో టికెట్లు రూ.300 నుంచి రూ.400 వరకు ఉండగా, తాజా ఆఫర్‌తో కొన్ని థియేటర్లలో రూ.99కే(Ramayana Movie Ticket Price) అందుబాటులోకి వచ్చాయి. కొన్ని స్క్రీన్లలో ధరల తగ్గింపు 80 శాతం వరకు ఉన్నాయి. 3డీ షోల టికెట్లు రూ.119 నుంచి రూ.249 మధ్య అందుబాటులో ఉండగా, కొన్ని ఐమ్యాక్స్ 3డీ స్క్రీన్లలో కూడా ధరలను తగ్గించారు. అయితే రెక్లైనర్, ప్రీమియం సీట్లు, ప్రత్యేక ఫార్మాట్లకు మాత్రం సాధారణ టికెట్ ధరల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

తగ్గిన వసూళ్ల జోరు
విడుదలైన తొలి రోజుల్లో ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించింది. తొలి నాలుగు రోజుల ఎక్స్‌టెండెడ్ వీకెండ్‌లోనే సుమారు రూ.238 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. దీపావళి సెలవుల సమయంలోనూ మంచి వసూళ్లను నమోదు చేసింది.మూడో వారంలోకి రాగానే వసూళ్ల వేగం నెమ్మదించింది. నవంబర్ 23న సినిమా ఇండియాలో రూ.12.70 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది.అంతకుముందు ఆదివారం వచ్చిన రూ.35.60 కోట్లతో(Ramayana Movie Ticket Price) పోలిస్తే చాలా వరకు తగ్గాయి. దీంతో మూవీ టీం కీలక నిర్ణయం తీసుకుంది. తిరిగి వసూళ్లు రాబట్టేందుకు.. రిపీటెట్ ఆడియోన్స్‌ మళ్లీ థియేటర్‌లో అడుగుపెట్టాలా కేవలం రూ. 99లకే సినిమా అంటూ బంపర్‌ ఆఫర్ ప్రకటింటింది.

రూ.1,700 కోట్ల క్లబ్‌లో సినిమా
వసూళ్లలో రోజువారీగా తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ సినిమా మొత్తం కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి. 19 రోజుల ప్రదర్శన ముగిసే సమయానికి ఇండియాలో రూ.955.45 కోట్ల నెట్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.1,704.65 కోట్ల(Ramayana Movie Ticket Price) గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం దేశీయంగా రూ.1,000 కోట్ల నెట్ మార్కును చేరుకోవడం సినిమాకు కీలకంగా మారింది. టికెట్ ధరల తగ్గింపు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.