Nayanthara Lookalike

లేడీ సూపర్‌స్టార్ నయనతార మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అచ్చం ఆమె పోలికలతో ఉన్న ఓ మహిళ కారణంగా నయనతార పేరు నెట్టింట మార్మోగుతోంది. ఆ మహిళ ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. తొలి చూపులో నయనతారే అనుకునేంతగా ఆమె పోలికలు ఉండటంతో అందరూ పొరపడిపోతున్నారు.ఇటీవల ఓ షాపింగ్ మాల్‌లో పిల్లలు ఆడుకుంటుండగా చిరునవ్వుతో వారిని గమనిస్తున్న ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ముఖ కవళికలు, కళ్లు, హెయిర్‌స్టైల్ నయనతారను పోలి ఉండటంతో చాలామంది తొలుత ఆమెను నయనతారగానే (Nayanthara Lookalike)భావించారు. కొందరైతే ఇది నయన్‌కు సంబంధించిన పాత వీడియో అంటూ కామెంట్లు చేశారు.ఈ వీడియో వైరల్ కావడంతో అందులో కనిపించిన మహిళ ఎవరనే దానిపై నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఎవరీ దీప్తి కల్యాణి?
వైరల్ వీడియోలో కనిపించిన మహిళ పేరు దీప్తి కల్యాణి. కేరళకు చెందిన ఆమె ట్రాన్స్‌జెండర్ మోడల్‌గా, మేకప్ ఆర్టిస్ట్‌గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ ఫ్యాషన్ రంగంలోనూ ఆమెకు పరిచయం ఉంది.తాజాగా నయనతారతో ఉన్న పోలికల కారణంగా ఆమెకు మరింత గుర్తింపు లభిస్తోంది. నెటిజన్లు ఆమెను ‘జూనియర్ నయనతార’, ‘నయన్ ట్విన్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో దీప్తి కల్యాణి పేరు దక్షిణాది సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తన రూపాన్ని నయనతారతో పోల్చడంపై దీప్తి కల్యాణి కూడా స్పందించారు. తాను ఎప్పుడూ నయనతారలా(Nayanthara Lookalike) ఉన్నానని చెప్పుకోలేదని, తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నానని పేర్కొన్నారు.అయితే దక్షిణాదిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన స్టార్ హీరోయిన్‌తో తనను పోల్చడం ఆనందంగా, గర్వంగా ఉందని ఆమె తెలిపినట్లు తెలుస్తోంది.మరోవైపు ఈ పోలికను కొందరు సోషల్ మీడియా యూజర్లు వ్యూస్ కోసం ఉపయోగించుకుంటున్నారనే వార్తలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వీడియోలను నయనతార వీడియోలుగా ప్రచారం చేస్తూ, తప్పుదారి పట్టించే క్యాప్షన్లతో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. మొత్తానికి, ఒక్క వైరల్ వీడియోతో దీప్తి కల్యాణి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. నయనతారతో ఆమెకున్న పోలికలు ఇప్పుడు నెటిజన్ల చర్చకు కారణమయ్యాయి.