థియేటర్లలో పోటీకి సిద్ధమైన ముగ్గురు స్టార్ హీరోయిన్లు
Lady Oriented Movies: నవంబర్ నెలలో నాలుగు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. పైగా ముగ్గురు స్టార్ హీరోయిన్లు నటిస్తుండటంతో మూడు సినిమాలపై భారీ ఆసక్తి నెలకొంది. రష్మిక మందన్న, కీర్తి సురేశ్, నయనతార నటించిన సినిమాలు ఈ నెలలో విడుదల కానున్నాయి.

Lady Oriented Movies: నవంబర్‌లో ప్రేక్షకులను అలరించేందుకు నాలుగు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఈ నాలుగు చిత్రాల కథాంశాలు ఆసక్తికరంగా ఉండటంతో పాటు, మూడింటిలో స్టార్ హీరోయిన్లు నటించడం విశేషం. నయనతార నటించిన మహాశక్తి, కీర్తి సురేశ్ నటించిన సత్యవాన్ సావిత్రి, రష్మిక మందన్న నటించిన మైసా సినిమాలు విడుదల కానున్నాయి.
మహాశక్తి-2. నయనతారపై భారీ అంచనాలు
సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన “మహాశక్తి-2” దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదలవుతోంది. తమిళ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఆరేళ్ల క్రితం వచ్చిన “మూకుత్తి అమ్మన్” తెలుగులోనూ ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు “మూకుత్తి అమ్మన్-2” తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమా “మహాశక్తి-2” పేరుతో విడుదల కానుంది. మొదటి భాగంలో అమ్మవారి పాత్రలో కనిపించిన నయనతారకు విశేష ఆదరణ లభించింది. దీంతో రెండో భాగంపైనా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ట్రైలర్‌ను చూస్తుంటే ఈ చిత్రాన్ని పీరియడ్ డ్రామా తరహాలో భారీ స్థాయిలో రూపొందించినట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా సూర్య “సీన్” సినిమా కూడా నవంబర్ 6నే విడుదలవుతోంది. అయినప్పటికీ నయనతార స్టార్డమ్తో పాటు తమ కథాంశంపై నమ్మకంతో “మహాశక్తి-2″ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
సత్యవాన్ సావిత్రి.. డియర్ ఆస్ట్రోనాట్
నవంబర్ 20నే కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన “సత్యవాన్ సావిత్రి” కూడా విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఓ సీనియర్ లాయర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సావిత్రి అనే అమ్మాయి న్యాయవాద వృత్తిని ఎంచుకుంటుంది. మొదట్లో తన వృత్తిపట్ల పెద్దగా అంకితభావం చూపించని సావిత్రి, ఆ తర్వాత ఓ క్లిష్టమైన కేసును ఎలా వాదించింది? తన భర్తను ఎలా కాపాడుకుంది అన్నదే ఈ చిత్ర కథాంశం. ఇదే నెలలో ఒకే రోజున రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ తమ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించే అమ్మాయిల కథలే ప్రధానాంశం. చిన్నతనం నుంచే ఆకాశం వైపు చూస్తూ, అమ్మమ్మ చెప్పే కథలు వింటూ పెరిగిన ఓ చిన్నారి ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటుంది. తన స్వప్నాన్ని ఆమె ఎలా సాకారం చేసుకుందన్నదే “డియర్ ఆస్ట్రోనాట్” కథ. కార్తిక్ భాగ్యరాజా రూపొందించిన ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది.
O Mysaa Re!!
A war cry!
A scream of pain and rage!
An awakening!!All yours now!
@rawindrapulle @jakes_bejoy @suddalaashokte1 @Sindhujas13 @brindagopal @kshreyaas #NaveenSasi @unformulafilms @tseriessouth https://t.co/4qLeUFdnuw
— Rashmika Mandanna (@iamRashmika) November 2, 2026
“మైసా” గిరిజన మహిళగా రష్మిక మందన్న
“మహాశక్తి-2” తరహాలోనే సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న మరో చిత్రం “మైసా”. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవీంద్ర పుల్లె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ గిరిజన మహిళ తన జీవితంలో ఎదురైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంది? దుష్టశక్తుల కారణంగా అతలాకుతలమైన తన జాతిని “మైసా” ఎలా రక్షించుకుంది? అన్నదే ఈ సినిమా ప్రధానాంశం. ఇప్పటికే “మైసా”లోని టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. “డియర్ ఆస్ట్రోనాట్”ను మినహాయిస్తే, నవంబర్‌లో విడుదలవుతున్న మిగతా మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. నయనతార, కీర్తి సురేశ్, రష్మిక మందన్న తమదైన నటనతో ఈ చిత్రాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయనున్నారు. విభిన్న కథాంశాలతో వస్తున్న ఈ నాలుగు సినిమాల్లో ఏది ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



