Netflix Pakistan Content Ban India

పాకిస్థాన్‌కు చెందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు ఈ మేరకు హెచ్చరికలు పంపింది. పాకిస్థాన్‌కు చెందిన ఎలాంటి డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌నూ భారతీయ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచవద్దని వార్నింగ్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా పాకిస్థాన్ వెబ్‌సిరీస్ ‘జో బచే హై సంగ్ సమేత్ లో’ (Jo Bachay Hain Sang Samait Lo) భారత్‌లో విడుదల కానుందన్న ప్రచారం ఇప్పడు కేంద్రబిందువైంది. ఈ సిరీస్ భారతీయ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందనే వార్తలతో వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌కు(Netflix Pakistan Content Ban India) గతంలో ఇచ్చిన ఆదేశాలను కేంద్రం మరోసారి గుర్తుచేసింది.

మార్గదర్శకాలు పాటించాల్సిందే!
భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓటీటీ, స్ట్రీమింగ్ సంస్థలు పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్‌ను ప్రసారం చేయకూడదని కేంద్ర ప్రభుత్వం 2025 మే 8న మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలు కేవలం కొత్తగా విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లకే కాకుండా సంబంధిత పాకిస్థానీ డిజిటల్ కంటెంట్‌కు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.అంతేకాకుండా 2025 జూన్‌లో నెట్‌ఫ్లిక్స్ కూడా భారతీయ సబ్‌స్క్రైబర్లకు పాకిస్థాన్‌కు చెందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల(Netflix Pakistan Content Ban India)ను అందుబాటులో ఉంచబోమని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లు కేంద్రం గుర్తుచేసింది. ఆ హామీకి విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సూచించింది.

పాక్ వెబ్‌సిరీస్ డిసెంబర్ 4న విడుదల
‘జో బచే హై సంగ్ సమేత్ లో’ పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటీనటులతో రూపొందిన రొమాంటిక్ డ్రామా వెబ్‌సిరీస్. ఇందులో ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, హానియా ఆమిర్, సనమ్ సయీద్ తదితరులు నటించారు. పాకిస్థాన్ నుంచి నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన తొలి ఒరిజినల్ సిరీస్‌గా ఇది గుర్తింపు పొందింది.ఈ సిరీస్‌ను డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే భారత్‌లోని సబ్‌స్క్రైబర్లకు కూడా ఇది అందుబాటులోకి వస్తుందా లేదా అనే విషయంపై సంస్థ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ సిరీస్(Netflix Pakistan Content Ban India) భారతీయ ప్రేక్షకులకు అందుతుందా లేదా అనేది సంస్థ తీసుకునే తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.