చిరు ఫ్యూచర్ ప్లాన్.. అభిమానులకు ఇక పండుగే పండుగ
మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత మరో వినూత్న అధ్యాయాన్ని స్టార్ట్ చేశారు. గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫిక్స్ వేదికగా ఒక ప్రత్యేకమైన టాక్ షో తో అలరించేందుకు రెడీ అయ్యారు. మెగావర్స్ అనే పేరుతో రూపొందుతున్న ఈ షో ద్వారా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.

Chiranjeevi’s Megaverse
మెగాస్టార్ చిరంజీవి .. ఈమాట వింటేనే ఒక వైబ్రేషన్. మాస్, క్లాస్ ఎవరైనా తన నటనతో రాఫ్పాడించేస్తారు చిరంజీవి. సుమారు 40ఏళ్లకు పైగా వెండితెరపై ఆయన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వారి ఆదరాభిమానాలు అందుకుంటున్నారు. చిరంజీవి సినిమా వస్తుందంటే ధియేటర్లు గడలాడలాడాల్సిందే. సంవత్సరాల తరబడి ఆడాల్సిందే. వెండితెరపై దశాబ్ధాలుగా తన నటనతో కోట్లాది మందిని అలరిస్తున్నారు చిరంజీవి. ఇకవైపు సినిమాలు తీస్తూనే.. మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు మెగాస్టార్. ప్రయోగాలకు పెట్టిందే పేరు చిరంజీవి. గతంలో మాటీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రొగ్రాం చేశారు. తర్వాత అది కొంత కాలానికి ఆగిపోయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు తన కేరీర్‌లో మరో వినూత్న అధ్యాయాన్ని స్టార్ట్ చేశారు. గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫిక్స్ వేదికగా ఒక ప్రత్యేకమైన టాక్ షో తో చిరు అలరించేందుకు రెడీ అయ్యారు. మెగావర్స్(Chiranjeevi’s Megaverse) అనే పేరుతో రూపొందుతున్న ఈ షో ద్వారా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు చిరంజీవి.
మెగావర్స్ షోకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమైంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్, ఎల్‌ఎల్‌పీ సంస్థలు ఈ షోను కలిసి నిర్మిస్తున్నాయి. షో షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఎంటర్‌టైన్ చేసేందుకు ఈ మెగావర్స్ (Chiranjeevi’s Megaverse)షో రెడీ అవుతోంది. అయితే ఈ షో ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇప్పటికే తెలుగులో హీరో బాలకృష్ణ- అన్‌స్టాపబుల్ , జగపతి బాబు- జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి, రానా- ది రానా దగ్గుబాటి షో, నాగార్జున – బిగ్‌బాస్, అమితాబ్ బచ్చన్- కౌన్ బనేగా కరోడ్‌పతి, సల్మాన్ ఖాన్- బిగ్‌బాస్ హిందీ చేస్తున్నారు.
చిరంజీవి అభిమానులు సైతం ఎప్పటినుంచో మా హీరో కూడా ఇలాంటి టాక్ షో చేస్తే బాడుండు అనేకునేవారు. వారి కోరిక మేరకు ఇప్పుడు చిరంజీవి మెగావర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇండియన్ సినిమా గొప్ప వారసత్వాన్ని, సినీ ప్రముఖుల జీవితంలోని ఆసక్తికరమైన ఘట్టాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడమే మెగావర్స్ (Chiranjeevi’s Megaverse)ముఖ్య ఉద్దేశం. ఈషో ద్వారా చిరంజీవి తన హాస్య చతురత, లోతైన ఆలోచన విధానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, భిన్న తరాలకు చెందిన స్టార్స్‌తో ఆయన ఈషోలో మాట్లాడనున్నారు. సంభాషణలు జరపనున్నారు. అద్భుతమైన కథలు, ఎన్నో కొత్త విషయాల ఆవిష్కరణలతో ఈ షో సాగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఇష్టమైన హీరోయిన్‌ల జీవిత ప్రయాణాలు, తెర వెనుక కథలు, వారి వ్యక్తిగత అనుభవాలను చిరంజీవి తనదైన శైలిలో ప్రేక్షకుల తెలియజేయనున్నారు. ఆయన యాక్టింగ్ టైమింగ్ ఈ షోకి ప్రధాన ప్లస్‌పాయింట్ కానుంది. చిరు హోస్ట్‌గా ఈషో మరో స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.



