డ్రగ్స్‌పై పోరుకు ప్రభాస్ సిద్ధం.. కిషన్‌రెడ్డి ఆహ్వానానికి గ్రీన్ సిగ్నల్
డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ నెల 25,26,27 తేదీల్లో హైదరాబాద్ వేదికగా నషాముక్త్ భారత్ కార్యక్రమం చేపడుతోంది.కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు 'Hyderabad Walks for Nasha Mukt Bharat' పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు.అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది.

Prabhas Nasha Mukt Bharat Campaign
డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ నెల 25,26,27 తేదీల్లో హైదరాబాద్ వేదికగా నషాముక్త్ భారత్ కార్యక్రమం చేపడుతోంది.కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు ‘Hyderabad Walks for Nasha Mukt Bharat’ పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు.అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. డ్రగ్స్ మహమ్మారిపై కిషన్‌రెడ్డి చేస్తున్న పోరాటానికి టాలీవుడ్ బాసటగా నిలుస్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas Nasha Mukt Bharat Campaign) తన వంతు చేయూత అందించేందుకు ముందుకొచ్చారు. యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న మత్తు పదార్థాల వ్యసనానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘నషాముక్త్ భారత్’ ప్రచారంలో భాగస్వామి కావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రభాస్‌ను ఆహ్వానించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
ఆప్యాయ పలకరింపు
ఈ సందర్భంగా ప్రభాస్ ఇంటికెళ్లి కలిశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. కేంద్రమంత్రికి ప్రభాస్ సాదరంగా స్వాగతం పలికారు. ఇద్దరు ఒకరినొకరు శాలువాతో సత్కరించుకొని సన్మానించుకున్నారు. అలాగే నషాముక్త్ భారత్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. డ్రగ్స్‌పై పోరాటంలో కేవలం ప్రభుత్వ చర్యలే సరిపోవని, ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువతను చెడు వ్యసనాల నుంచి దూరం చేయడంలో సినీ ప్రముఖుల ప్రభావం ఎంతో ఉంటుందని పేర్కొన్నారు. ప్రభాస్(Prabhas Nasha Mukt Bharat Campaign)కు ఉన్న భారీ అభిమానగణం, యువతలో ఆయనకున్న క్రేజ్ ఈ ఉద్యమానికి మరింత బలాన్ని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ
నషాముక్త్ భారత్ కార్యక్రమానికి రావాలని ప్రభాస్‌కు కిషన్‌రెడ్డి ఆహ్వానం
ప్రభాస్‌తో కలిసి నషాముక్త్ భారత్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కిషన్‌రెడ్డి
ఈ నెల 25-27 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న నషాముక్త్ భారత్ కార్యక్రమం
ఇప్పటికే చిరంజీవిని కలిసి నషాముక్త్ భారత్‌కు ఆహ్వానించిన కిషన్‌రెడ్డి
@kishanreddybjp @prabhas
#NashaMuktBharat #Hyderabad #Prabhas #BJP— Telugu Popular TV (@TeluguPopularTV) November 22, 2026
టాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ఒక్కరి బాధ్యత కాదని, ప్రభుత్వాలు, సినీ ప్రముఖులు, సామాజిక సంస్థలు, ప్రజలు సమష్టిగా ముందుకొస్తేనే లక్ష్యం సాధ్యమవుతుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తును కాపాడే ఈ సామాజిక ఉద్యమంలో ప్రచారానికి సినీ పరిశ్రమ నుంచి విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా కిషన్‌రెడ్డి ఇప్పటికే పలువురు ప్రముఖులను కలిశారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దర్శకులు సుకుమార్, బోయపాటి శ్రీను, హీరో వెంకటేశ్‌లను కూడా కలిసి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు సినీ తారల గొంతు కలిస్తే ఆ సందేశం మరింత మందికి చేరే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభాస్(Prabhas Nasha Mukt Bharat Campaign) మద్దతుతో నషాముక్త్ భారత్ ప్రచారానికి టాలీవుడ్ నుంచి మరింత ఊపు వస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.



