తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదం. స్టాలిన్‌పై గెలిచిన ఎమ్మెల్యే మృతి
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొళత్తూరు నియోజకవర్గం టీవీకే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

Kolathur TVK MLA VS Babu passes away
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొళత్తూరు నియోజకవర్గం టీవీకే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Kolathur TVK MLA VS Babu passes away)విడిచారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ మృతి చెందారు.
70 రోజులకుపైగా ఆసుపత్రిలో చికిత్స
వీఎస్ బాబు శ్వాసకోశ సమస్యలతో సెప్టెంబర్ 9న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. సుమారు 70 రోజులకు పైగా ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందించారు. గురువారం మధ్యాహ్నం 2:14 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం 2:24 గంటలకు ఆయన మరణించినట్లు(Kolathur TVK MLA VS Babu passes away) ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
2026లో స్టాలిన్‌పై విజయం
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వీఎస్ బాబు గ్రాండ్ విక్టరీ సాధించారు. డీఎంకే అధినేత, అప్పటి సీఎం ఎంకే స్టాలిన్‌కు బలమైన పట్టున్న కొళత్తూరు నియోజకవర్గంలో టీవీకే తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వీఎస్ బాబుకు 82,997 ఓట్లు పోలవగా, ఎంకే స్టాలిన్‌కు 74,202 ఓట్లు వచ్చాయి. 8,795 ఓట్ల ఆధిక్యంతో వీఎస్ బాబు గెలుపొందారు. స్టాలిన్ వంటి కీలక నేతను ఓడించడంతో బాబు (Kolathur TVK MLA VS Babu passes away) పేరు రాష్ట్ర రాజకీయాల్లో మార్మోగింది.
கொளத்தூர் தொகுதி சட்டமன்ற உறுப்பினர் திரு. வி.எஸ். பாபு அவர்களின் மறைவுச் செய்தி வருத்தமளிக்கிறது. பல நாட்களாக மருத்துவமனையில் சிகிச்சை பெற்று வந்த அவரது உடல்நிலையில் முன்னேற்றம் இருப்பதாகச் செய்திகள் தொடர்ந்து வெளியிடப்பட்டு வந்த நிலையில், திடீரென வெளியாகி உள்ள அவரது மறைவுச் செய்தி அதிர்ச்சியளிக்கிறது.
திரு. பாபு அவர்களை இழந்து வாடும் அவரது குடும்பத்தாருக்கும் அவர் சார்ந்த கட்சியினருக்கும் எனது ஆழ்ந்த இரங்கலையும் ஆறுதலையும் தெரிவித்துக் கொள்கிறேன்.
— M.K.Stalin (@mkstalin) November 19, 2026
రాజకీయ ప్రస్థానం
వీఎస్ బాబు రాజకీయ ప్రస్థానం డీఎంకేతో ప్రారంభమైంది. పార్టీ కోసం పనిచేస్తూ ఉత్తర చెన్నై జిల్లా కార్యదర్శి బాధ్యతలు కూడా నిర్వహించారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో పురసవాక్కం నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. 2011 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎంకేకు దూరమై 2016లో అన్నాడీఎంకేలో చేరారు. అనంతరం 2026 ఫిబ్రవరి 7న నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగంలో బాబు (Kolathur TVK MLA VS Babu passes away) చేరారు. పార్టీ ఆయనకు కొళత్తూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించగా, స్టాలిన్‌పై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ప్రముఖుల సంతాపం
వీఎస్ బాబు మరణవార్తపై టీవీకే అధినేత విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన మరణం తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం బాబు(Kolathur TVK MLA VS Babu passes away) మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీఎస్ బాబు మరణంతో కొళత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి ఖాళీ ఏర్పడింది. రాజకీయంగా కీలకమైన విజయంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆకస్మిక మరణం టీవీకే శ్రేణులను విషాదంలో ముంచెత్తింది.
கொளத்தூர் தொகுதி சட்டமன்ற உறுப்பினர் திரு.வி.எஸ்.பாபு அவர்கள் உடல்நலக்குறைவால் மறைந்த செய்தி அறிந்து ஆழ்ந்த வேதனையும், துயரமும் அடைந்தேன்.
பொதுவாழ்வில் தன்னை முழுமையாக அர்ப்பணித்துக் கொண்டு, மக்களோடு மக்களாகப் பழகி, அனைவரின் அன்பையும், ஆதரவையும், நம்பிக்கையையும் பெற்றிருந்த திரு.வி.எஸ்.பாபு அவர்களின் திடீர் மறைவு ஈடுசெய்ய முடியாத பேரிழப்பாகும்.
திரு.வி.எஸ்.பாபு அவர்களின் பிரிவால் துயரத்தில் ஆழ்ந்துள்ள அவரது குடும்பத்தினர், உறவினர்கள், நண்பர்கள், தமிழக வெற்றிக் கழக நிர்வாகிகள், தொண்டர்கள் மற்றும் கொளத்தூர் தொகுதி மக்கள் அனைவருக்கும் எனது ஆழ்ந்த இரங்கலையும், ஆறுதலையும் தெரிவித்துக்கொள்கிறேன்.
— CMOTamilNadu (@CMOTamilnadu) November 19, 2026



