తమిళనాట రచ్చ రచ్చ.. కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తన..!
తమిళనాడులోని కల్లకురిచ్చి నియోజకవర్గం టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నశ్ ఇప్పుడు వివాదంలో చిక్కున్నారు. కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు ఆయన అసభ్యకరమైన మెసేజ్‌లు పంపాడనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

TVK MLA Arul Vignesh Controversy
తమిళనాడులోని కల్లకురిచ్చి నియోజకవర్గం టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నశ్ ఇప్పుడు వివాదంలో చిక్కున్నారు. కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు ఆయన అసభ్యకరమైన మెసేజ్‌లు పంపాడనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఫుల్‌గా మందుకొట్టి మత్తులో కలెక్టర్ నివాసానికి వెళ్లి వేధించినట్లు ప్రతిపక్ష పార్టీలు డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈవివాదంపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా స్పందించారు. టీవీకే ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు. రాష్ట్రంలో మహిళా కలెక్టర్లకే రక్షణ లేకుండా పోతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి విజయ్ ఈఘటనపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్(TVK MLA Arul Vignesh Controversy) వివాదంపై కాంగ్రెస్ ఎంపీ జోతిమణి సైతం స్పందించారు. ఎమ్మెల్యే తీరుపై ఎంక్వైరీ చేసి.. నిజమని తేలితే ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెస్తాయని సూచించారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మరోవైపు ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్(TVK MLA Arul Vignesh Controversy) తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అధికారులంటే తనకు ఎంతో గౌరవమని, తనపై రాజకీయ కక్షతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ నివాసంలో భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు ఉన్నప్పుడు తాను ఎలా వెళ్లగలనని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేస్తూ .. తన వ్యక్తిగత ఇమేజ్‌ని డ్యామేజ్‌చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. ఇదే వివాదంపై విద్యాశాఖ మంత్రి, టీవీకే నేత రాజ్ మోహన్ స్పందించారు. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం ఎవరిపైనా పక్షపాతం చూపదని స్పష్టం చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆరోపణలు నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఈ వ్యవహారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత విచారణ చేపట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కల్లకురిచ్చి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేపై మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల ఆరోపణలు రావడం, దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.



