Vijay Government Allows Benefit Show

“ఒడ్డించే వాడు మనోడైతే.. చివరి బంతిలో కూర్చున్నా అన్నీ అందుతాయి.” అనే సామెత మీరు వినే ఉంటారు. అంటే మనకు సహకరించే వ్యక్తి అధికారంలోనో, కీలక స్థానంలోనో ఉంటే.. ఎంత ఆలస్యమైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనకు అనుకూలంగా పనులు జరుగుతాయనేది దీని అర్థం. అయితే తమిళనాడులో చాలాకాలంగా బెనిఫిట్ షోల సందడి ఆగిపోయింది. కోట్లు ఖర్చుపెట్టిన సినిమా తీసినప్పుడు బెనిఫిట్(Vijay Government Allows Benefit Show) షోలు వేయాలనేది అక్కడి నిర్మాతల మండలి కోరిక. ఉదయం నుంచే షోలు నడిస్తే బాగా కలెక్షన్లు వస్తాయనేది వారి భావన. ఎన్నిసార్లు ఆదిశగాప్రయత్నాలు చేసినా తమిళనాడులో గత ప్రభుత్వం సహకరించలేదు. అయితే ఈసారి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నికైన వ్యక్తే సీఎం కావడంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారం అయింది.

గుడ్‌న్యూస్
టోటల్‌గా చెప్పాలంటే తమిళనాడులో సినిమా అభిమానులకు విజయ్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్తగా విడుదలయ్యే సినిమాలకు మొదటి వారం రోజులు ఉదయం 6 గంటల నుంచే బెన్‌ఫిట్(Vijay Government Allows Benefit Show) షోలు ప్రదర్శించుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. అంతేకాదు.. థియేటర్లలో రోజుకు ఐదు షోలు,వీకెండ్స్‌, హాలిడేస్‌లో డైలీ ఆరు షోలు వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2:30 గంటల వరకు సినిమాల ప్రదర్శనకు అనుమతి కల్పించింది. దీంతో తమిళనాడులో మళ్లీ బెనిఫిట్ షోల సందడి మొదలుకానుంది.

బెన్‌ఫిట్ షోపై నిషేధం
ఇప్పటివరకు తమిళనాడులో రోజుకు నాలుగు షోలు మాత్రమే పర్మిషన్‌ ఉండేది. ఉదయం 9 గంటలకు మార్నింగ్ షో స్టార్ట్ అవుతోంది. గతంలో అజిత్ నటించిన ‘తునివు’ సినిమా విడుదల సందర్భంగా చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత అప్పటి డీఎంకే ప్రభుత్వం తెల్లవారుజామున 4, 5, 6 గంటలకు నిర్వహించే బెనిఫిట్(Vijay Government Allows Benefit Show) షోలపై నిషేధం విధించింది. అప్పటి నుంచి షో టైమింగ్స్ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. తాజాగా విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో థియేటర్ యాజమాన్యాలు, సినీ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. నవంబర్ 6న విడుదల కానున్న సూర్య నటించిన ‘సీన్’, నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మూక్కుత్తి అమ్మన్ 2’ సినిమాలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దీంతో ఈ రెండు సినిమాలతోనే తమిళనాడులో బెన్‌ఫిట్ షోల సందడి మళ్లీ మొదలుకానుంది.