TS Inter Time Table 2027

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు గురువారం విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 19 వరకు పరీక్షలు(TS Inter Time Table 2027) కొనసాగనున్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సులకు చెందిన విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి.

ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు
ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 2027 ఫిబ్రవరి 24 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు మార్చి 19 వరకు కొనసాగుతాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు(TS Inter Time Table 2027) మొదలుకానున్నాయి. మార్చి 20 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్
థియరీ పరీక్షలకు ముందుగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేసింది. 2027 ఫిబ్రవరి 1 నుంచి 18వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలను(TS Inter Time Table 2027) ఆదివారాల్లో కూడా నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ఒకేషనల్ కి ప్రత్యేక షెడ్యూల్
జనరల్ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీరికి కూడా రెండు సెషన్ల విధానమే వర్తిస్తుంది. అయితే ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల తేదీలు, సబ్జెక్టుల వారీగా ప్రత్యేక టైమ్‌టేబుల్‌ను (TS Inter Time Table 2027)బోర్డు విడిగా విడుదల చేయనుంది. కాబట్టి ఒకేషనల్ విద్యార్థులు తమ పరీక్షల తేదీల కోసం ప్రత్యేక షెడ్యూల్‌ను పరిశీలించాల్సి ఉంటుంది.

ఇప్పటి నుంచే సిద్ధం కావాలి
పరీక్షల తేదీలు ఖరారు కావడంతో ఇంటర్ విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలకు(TS Inter Time Table 2027) అనుగుణంగా చదువును ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలి. పరీక్షల సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా బోర్డు విడుదల చేసిన అధికారిక టైమ్‌టేబుల్‌ను జాగ్రత్తగా పరిశీలించి, పరీక్షల తేదీలు, సమయాలను ముందుగానే గుర్తుంచుకోవాలి.