అంతా అయ్యప్ప వల్లే.. మేమంతా సేఫ్
కారు ప్రమాదంపై టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నట్లు వీడియో విడుదల చేశారు. అయ్యప్పస్వామి దయ వల్లే ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామని భావోద్వేగంతో చెప్పారు.

Shekhar Master Car Accident
కారు ప్రమాదంపై టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నట్లు వీడియో విడుదల చేశారు. ఇటీవల అయ్యప్ప మాల ధరించిన శేఖర్ మాస్టర్.. అయ్యప్పస్వామి దయ వల్లే ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామని భావోద్వేగంతో చెప్పారు. అయ్యప్ప స్వామి కటాక్షం వల్లే కారులో ప్రయాణిస్తున్న ఎవ్వరికీ ఏం కాలేదని చెప్పారు. మళ్లీ షూటింగ్‌కి వెళ్తున్నామంటూ శేఖర్ మాస్టర్ (Shekhar Master Car Accident)వీడియో విడుదల చేశారు. ‘కాకా సాంగ్ షూటింగ్ ని ముగించుకొని తిరిగి వస్తుంటే తెల్లవారుజామున 6 గంటలకు కారు యాక్సిడెంట్ కి గురైందని వీడియోలో చెప్పారు. ప్రమాదం జరిగిందని తెలిసి వెంటనే అందరూ తనకు ఏమైందో అని మెసేజ్ లు చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నాను. మాతో పాటు ఉన్నవారు కూడా క్షేమంగా ఉన్నారని శేఖర్ మాస్టర్ తెలిపారు. శ్రేయోభిలాషులెవరూ అధైర్య పడొద్దని సూచించారు.
Gave clarity on morning issue …..by shekarmaster https://t.co/PKkyF0ZzeD
— Aravinda reddy (@arareddye) November 12, 2026
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ‘కాకా’లో ఓ పాట చిత్రీకరణ కోసం నైట్ షూటింగ్‌కి వెళ్లారు. షూటింగ్ ముగించుకుని, తిరిగి తన బృందంతో కలిసి వస్తుండగా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ దగ్గరకు రాగానే యాక్సిండెంట్ జరిగింది. ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ఈప్రమాదం జరిగింది. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన పండ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం.. శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు(Shekhar Master Car Accident)ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అలాగే కారు ముందు ఉన్న పెద్ద గోడను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో శేఖర్ మాస్టర్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు. నలుగురు వ్యక్తులు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



