రీల్స్ పిచ్చి.. సోషల్ మీడియా ఎఫెక్ట్. కడతేర్చిన పేరెంట్స్!
ఝార్ఖండ్‌లో అమానవీయ ఘటన జరిగింది. స్మార్ట్‌ఫోన్‌లో రీల్స్ చేస్తోందన్న కోపంతో కడుపున పుట్టిన కూతుర్నే ఓ గిరిజన దంపతులు కర్రతో కొట్టి చంపారు. ఈఘటన తూర్పు సింగ్భూమ్ జిల్లాలో జరిగింది.

Jharkhand Parents Kill Daughter
జార్ఖండ్‌లో ఘోర అమానవీయ ఘటన జరిగింది. 14ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని కాదనుకున్నారు. సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయిన కూతుర్ని ఎన్నిసార్లు మందలించినా వినకపోవడంతో చివరకు క్షణికావేశంలో కడతేర్చారు. పెంచిన చేతులతోనే చివరకు కూతురి ప్రాణాలు(Jharkhand Parents Kill Daughter) తీశారు. ఈదారుణ ఘటన జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎనిమిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల కనకలత ముర్ము మొబైల్ ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతూ రీల్స్ చేస్తుండటంపై తల్లిదండ్రులు రవీంద్ర ముర్ము, సుమనీలు అభ్యంతరం తెలిపారు. నవంబర్ 10న ఇంట్లో గొడవ జరగగా, ఆగ్రహంతో ఊగిపోయిన దంపతులు కర్రలతో బాలికపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో కనకలత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
పేరెంట్స్ డ్రామా!
కూతురి మరణంతో భయపడాల్సిన తల్లిదండ్రులు, నేరాన్ని దాచిపెట్టేందుకు మరింత అమానుషంగా వ్యవహరించారు. బాలిక మృతదేహాన్ని సమీపంలోని పాడుబడిన క్వారీలో పడేసి, తమ కుమార్తె కనిపించడం లేదంటూ డ్రామా ఆడారు. గ్రామస్తులు, పోలీసులను(Jharkhand Parents Kill Daughter) నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే నవంబర్ 13న క్వారీలో కనకలత మృతదేహం బయటపడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల పాటు రహదారులను దిగ్బంధించి ఆందోళన చేపట్టారు.
టెక్నికల్ ఆధారాలతో అరెస్ట్!
మొదట్లో తల్లిదండ్రులపై అనుమానాలు వ్యక్తమైనా, బలమైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేకపోయారు. సాంకేతిక ఆధారాలు, స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. చివరకు రవీంద్ర, సుమనీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, వారే హత్య(Jharkhand Parents Kill Daughter) చేసినట్లు అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. నవంబర్ 26న ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు కమల్పూర్ పోలీస్ స్టేషన్ అధికారి ధనంజయ్ పాశ్వాన్ తెలిపారు. నిందితులను న్యాయపరమైన ప్రక్రియకు అప్పగించగా, ఈ హత్యలో మరెవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.



