అప్పుడు పంజాగుట్ట.. ఇప్పుడు కీసర.. బోత్ ఆర్ సేమ్!

అప్పుడు పంజాగుట్ట, ఇప్పుడు కీసర. రెండు చోట్లా ఒకే స్టోరీ రిపీట్ అయింది. అప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో
85 మంది సిబ్బందిపై ఒకేసారి బదిలీ వేటు పడింది. ఎస్సైనుంచి హోంగార్డువరకు పాతవాళ్లనెవరినీ పంజాగుట్ట పీఎస్‌లో లేకుండా చేశారు. ఒక పీఎస్‌నుంచి ఒకేసారి అంతమంది బదిలీ అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టిస్తే.. ఇప్పుడు కీసర పోలీస్ స్టేషన్‌లోనూ అదే జరిగింది.
అవినీతి ఆరోపణలు, ఏసీబీ దాడులతో కీసర పీఎస్‌లో ప్రక్షాళన మొదలైంది. సెప్టెంబర్ 16న కీసర CI ఆర్కపల్లి ఆంజనేయులు, SI ద్యాపా జ్ఞానేందర్ రెడ్డి 5 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. నవంబర్ 9న మరో ఎస్సై కొండారెడ్డి శ్రీనివాస్ రెడ్డి 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.
కీసర ఎస్సై నాగరాజు, మరో 10 మంది కానిస్టేబుళ్లను సౌత్ జోన్‌కు బదిలీ చేశారు. మరోవైపు కొత్తగా ముగ్గురు ఎస్‌ఐలు నియమితులయ్యారు.ఎస్సై చేతివాటం ప్రదర్శిస్తున్నాడంటే కానిస్టేబుల్ చేతులు కట్టేసుకుని కూర్చుంటాడా. తిలాపాపం తలా పిడికెడన్నట్లు ఎవరి పరిధిలో వారు దోచుకుంటున్నారు. అందుకే తీవ్ర ఆరోపణలు వచ్చినా, ఏసీబీ దాడుల్లో చిక్కినా మొత్తం స్టేషన్ సిబ్బందినే ప్రక్షాళన చేయాలనే నిర్ణయానికి పోలీసు శాఖ వచ్చినట్లు కనిపిస్తోంది.



