అనుకోని ప్రమాదమా? హత్యాయత్నమా?

Jogi Ramesh: మొగుడు కాదు ‘మాడా’ అని పెళ్లయ్యాక తెలిసింది. తన కొడుకు లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు అన్యాయంగా ఓ అమ్మాయి గొంతుకోశాడు మాజీ మంత్రి. ఎలాగూ బయటపడుంతుందని తెలుసు. అందుకే అది బయటికొచ్చేలోపే కోడలి గొంతు నులిమేయాలనుకున్నారు. జోగి రమేష్ ఇంట్లో జరిగినదారుణాలను కోడలు మేఘన బయటికొచ్చి చెప్పినప్పుడు అంతా నిర్ఘాంతపోయారు. ఆమెను చంపడానికి జరిగిన కుట్రలు తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు.
న్యాయంకోసం పోలీసులను ఆశ్రయించింది జోగి మేఘన. న్యాయం జరగడం లేదని ఈమధ్యే గవర్నర్ని కూడా కలిసింది. జోగి రమేష్ వైసీపీ నాయకుడు. జగన్ అధికారంలో ఉండగా చంద్రబాబు ఇంటిమీదికి అనుచరగణంతో దాడి చేసినవాడు. అలాంటివాడిపై ఇంత తీవ్ర అభియోగాలు ఇచ్చినా, ఆ కుటుంబం పెట్టిన గృహహింసపై కోడలు ఆధారాలు సమర్పించినా ఇప్పటిదాకా చర్యలు లేవు. పైగా అత్తింటి అఘాయిత్యాలను బయటపెట్టిన బాధితురాలిని భౌతికంగా లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నట్లు అనుమానాలు వస్తున్నాయి.
తండ్రితో కలిసి జోగి మేఘన విజయవాడ నుంచి కోదాడ వెళ్తుండగా వారంక్రితం ప్రమాదం జరిగింది. వెనుక వచ్చిన ట్రావెల్స్ బస్సు వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై జోగి మేఘన కుటుంబం అనుమానాలు వ్యక్తంచేస్తోంది. జోగిరమేష్ కుటుంబం హస్తం ఉండొచ్చని ఇబ్రహీంపట్నం పీఎస్లో మేఘన తండ్రి ఫిర్యాదుచేశారు. ఇప్పటికే మేఘన హత్యాయత్నం, వరకట్న వేధింపుల ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదుచేసింది. అత్తింటినుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈలోపే ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది.



