వాట్సాప్‌లో వైరల్ మెసేజ్.. కేంద్రం అలర్ట్!
'యూనివర్సల్ సబ్సిడీ ప్రోగ్రామ్-2026' పేరుతో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చిచెప్పింది. ప్రతి ఒక్కరికీ రూ.30 వేల సబ్సిడీ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని ప్రకటించలేదని స్పష్టం చేసింది.

Universal Subsidy Program
మీ బ్యాంకు ఖాతాలోకి రూ.30 వేలు వస్తాయా? దేశంలోని ప్రతి పౌరుడికీ కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోందంటూ వస్తున్న సందేశాలు నిజమేనా? సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ‘యూనివర్సల్ సబ్సిడీ ప్రోగ్రామ్-2026’ పేరుతో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చిచెప్పింది. ప్రతి ఒక్కరికీ రూ.30 వేల సబ్సిడీ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని ప్రకటించలేదని స్పష్టం చేసింది.
🚨 Cyber Fraud Alert!
A message being circulated on #WhatsApp, claims that every citizen will receive a subsidy of ₹30,000 under the ‘Government Universal Subsidy Program 2026’, urging recipients to apply through a suspicious link.
#PIBFactCheck:
❌ The claim is #FAKE.
✅ NO such announcement has been made by the Government of India.
ℹ️ Do not click on suspicious links or share personal or banking details. Always verify information through official sources and refrain from forwarding unverified claims.
— PIB Fact Check (@PIBFactCheck) November 23, 2026
అయితే ఈ మోసం వెనుక ఆసక్తికరమైన వ్యవహారం ఉంది. ఎస్‌బీఐ లోగోను ఉపయోగించి నకిలీ దరఖాస్తు ఫామ్‌ను రూపొందించిన సైబర్ మోసగాళ్లు.. రూ.30 వేల సబ్సిడీ పొందాలంటే వెంటనే లింక్ క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, 2026 చివరి నాటికి దరఖాస్తు గడువు ముగుస్తుందంటూ ప్రజల్లో ఆతృతను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీఐబీ హెచ్చరించింది. ఇలాంటి అనుమానాస్పద లింక్‌లను తెరవవద్దని, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించింది. ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మకుండా అధికారిక వెబ్‌సైట్లలో ధృవీకరించుకోవాలని స్పష్టం చేసింది. గుర్తుంచుకోండి.. రూ.30 వేల ఆశ చూపించి మీ ఖాతాలోని సొమ్ముకే కన్నం వేయొచ్చు!



